సమంత లేటెస్ట్ మూవీ యశోద. పక్కా థ్రిల్లర్ ఙానర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసారు. ఈ గ్లింప్స్ ను చాలా ఆసక్తిగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో ఆకట్టుకునేలా రూపొందించారు. సబ్ఙెక్ట్ ను, కానీ ఙానర్ ను కానీ దాచడానికి దర్శకులు హరి-హరీష్ ప్రయత్నించలేదు. విషయాన్ని చెప్పీ చెప్పకుండా చూపించి, సినిమా మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేసారు.
ఆసుపత్రి బెడ్ మీద కళ్లు తెరచిన యశోద తన డ్రెస్, తనున్న పరిసరాలు గమనించి ఆశ్చర్యపోవడం, కిటికీ ఆవల వున్న పావురాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం గ్లింప్స్ లో చూపించారు. పావురాన్ని స్వేచ్ఛకు సింబాలిక్ గా, ఆ స్వేచ్ఛ కోసం హీరోయిన్ ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పారు.
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న చిత్రం ‘యశోద’. జంట దర్శకులు హరి-హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గ్లింప్స్ విడుదల సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ-‘’ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో సమంత కు పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు వచ్చింది. దాన్ని దృష్టి లో పెట్టుకుని ఆమె స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే సమంత ‘యశోద’ పాత్ర విషయంలో కనబరిచిన డెడికేషన్, పాత్రను సొంతం చేసుకున్న తీరు ప్రశంసాపాత్రంగా వుంది. సమంత నటన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది.
ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తైయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఆఖరి షెడ్యులు చేస్తున్నాం. జూన్ మొదటి వారానికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్ లో కోడైకెనాల్ లో క్లైమాక్స్ తీశాం. ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యం లో ప్రదాన తారాగణం పై ఈ క్లైమాక్స్ చిత్రీకరించాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.