షాక్‌లో ఉన్నానంటున్న లేడీ కొరియోగ్రాఫ‌ర్‌

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అరెస్ట్‌కు దారి తీసిన ప‌రిస్థితులేంటో అంద‌రికీ తెలుసు. త‌న‌పై జానీ మాస్ట‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న అసిస్టెంట్ ఫిర్యాదు చేయ‌డం, ఆధారాలు చూప‌డంతో పోలీసులు అరెస్ట్ చేసి క‌ట‌క‌టాల‌పాలు…

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అరెస్ట్‌కు దారి తీసిన ప‌రిస్థితులేంటో అంద‌రికీ తెలుసు. త‌న‌పై జానీ మాస్ట‌ర్ అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న అసిస్టెంట్ ఫిర్యాదు చేయ‌డం, ఆధారాలు చూప‌డంతో పోలీసులు అరెస్ట్ చేసి క‌ట‌క‌టాల‌పాలు చేసిన సంగ‌తి తెలిసిందే. జానీ మాస్ట‌ర్‌ను జ‌న‌సేన సైతం ప‌క్క‌న పెట్టింది. జానీ మాస్ట‌ర్‌పై కేసు తేలే వ‌ర‌కూ జ‌న‌సేన పార్టీ దూరంగా పెట్టాల‌ని అనుకుంది.

ఈ నేప‌థ్యంలో లేడీ కొరియోగ్రాఫ‌ర్ అనీ మాస్ట‌ర్ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. తాను షాక్‌లో ఉన్న‌ట్టు అనీ చెప్పుకొచ్చారు. దీనికి కార‌ణం జానీ మాస్ట‌ర్‌పై కేసు పెట్ట‌డ‌మే అని ఆమె అన్నారు. అలాగే జానీ మాస్ట‌ర్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ర‌ద్దు చేయ‌డం కూడా త‌న‌కెంతో బాధ క‌లిగించింద‌ని అనీ వాపోయారు. తెలుగు టెక్నీషియ‌న్‌కి ఇచ్చిన పురస్కార‌మ‌ని, అలాంటి దాన్ని లైంగిక ఆరోప‌ణ‌లు రావ‌డంతో వెన‌క్కి తీసుకోవ‌డం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు.

జానీ మాస్ట‌ర్ ఇంకా త‌ప్పు చేసిన‌ట్టు రుజువు కాలేదు క‌దా? అని అనీ నిల‌దీశారు. తాను రెండేళ్ల పాటు జానీ మాస్ట‌ర్ వ‌ద్ద ప‌ని చేశాన‌ని, ఆయ‌న చాలా మంచోడ‌ని అనీ ఉత్త‌మ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. జానీ మాస్ట‌ర్‌పై ఆరోప‌ణ‌లు రావ‌డం బాధాక‌ర‌మ‌ని ఆమె పేర్కొన్నారు. జానీ త‌ప్పు చేసి వుంటే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తూనే, మ‌రోవైపు నిర‌ప‌రాధి అని తేలితే ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించారు.

జానీపై అక‌స్మాత్తుగా బాధితురాలు ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఎలా చూడాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. అమ్మాయికి సంబంధించి సున్నిత‌మైన అంశం కాబ‌ట్టి ఎవ‌రూ మాట్లాడ‌లేక‌పోతున్నార‌ని ఆమె అన్నారు. త‌న గురువు జైల్లో వుండ‌డం ఎంతో బాధిస్తోంద‌ని అనీ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

4 Replies to “షాక్‌లో ఉన్నానంటున్న లేడీ కొరియోగ్రాఫ‌ర్‌”

  1. ఓరి బామ్మర్ది…….. నీ రాతలలోనే నీ బాదేంటో అర్ధమౌతుంది… ఏది ఏమైనా కూడా నీ ప్రయత్నానికి all the best బామ్మర్ది…….

  2. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డ్ ఆపితే, జగన్ ని కూడా mla పదవి నుండి అనర్హత వేటు వేయాలి.

    కేసు నిర్దారణ కాకుండా దోషి అని ఎలా నిర్ణయిస్తారు.

    ఆలా ఐతే కోర్ట్ లు ఎందుకు.

Comments are closed.