ఎఫ్2తో పనిలేదంటున్న అనీల్ రావిపూడి

ఎఫ్2.. గతేడాది సంక్రాంతి హిట్. అనీల్ రావిపూడిని పూర్తిస్థాయిలో టాప్ లీగ్ లోకి తీసుకొచ్చిన సినిమా. అంతెందుకు.. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా చేయడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడీ సినిమా బాలీవుడ్…

ఎఫ్2.. గతేడాది సంక్రాంతి హిట్. అనీల్ రావిపూడిని పూర్తిస్థాయిలో టాప్ లీగ్ లోకి తీసుకొచ్చిన సినిమా. అంతెందుకు.. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా చేయడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. అయితే ఈ రీమేక్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు అనీల్ రావిపూడి.

మళ్లీ అదే స్టోరీ ఎందుకు చేస్తానని ప్రశ్నిస్తున్న అనీల్… ఎఫ్2 హిందీ రీమేక్ లో తను ఇన్వాల్వ్ అవ్వడం లేదని స్పష్టంచేశాడు.. ఆ ప్రాజెక్టుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 మీద వర్క్ చేస్తున్నట్టు ప్రకటించాడు. 

ఇలా ఎఫ్2 హిందీ రీమేక్ లో కూడా తన ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తల్ని ఖండించాడు. ఎఫ్2ను హిందీలో బోనీకపూర్ నిర్మిస్తున్నాడు. తెలుగులో వరుణ్ తేజ్ పోషించిన పాత్రను హిందీలో బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్ పోషిస్తున్నాడు. అనీస్ బజ్మీ ఈ రీమేక్ కు దర్శకుడు.

ఇక ఎఫ్3 విషయానికొస్తే.. ఎప్పట్లానే వెంకీ పాత్రలో వెంకటేష్, వరుణ్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారు. అయితే ఈసారి మూడో పాత్ర కూడా ఉంది. ఆ క్యారెక్టర్ కోసం మరో హీరోను వెదికే పనిలో బిజీగా ఉన్నాడు అనీల్ రావిపూడి. రవితేజ లాంటి హీరోల పేర్లను పరిశీలిస్తున్నాడు.

ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' స్పెషల్ ఇంటర్వ్యూ