బాలయ్య సింగిల్ రోల్ నే-అనిల్ రావిపూడి

బాలయ్య సినిమా అంటే డబుల్ రోల్ అనేంతగా అలవాటైంది. సింహా, లెజెండ్, అఖండ, రాబోతున్న వీరసింహారెడ్డి ఇలా అన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. వాటిలో డబుల్ రోల్స్ గుర్తుకు వస్తాయి. కానీ ఫర్ ఏ…

బాలయ్య సినిమా అంటే డబుల్ రోల్ అనేంతగా అలవాటైంది. సింహా, లెజెండ్, అఖండ, రాబోతున్న వీరసింహారెడ్డి ఇలా అన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. వాటిలో డబుల్ రోల్స్ గుర్తుకు వస్తాయి. కానీ ఫర్ ఏ ఛేంజ్ అనిల్ రావిపూడి డైరక్షన్ లో చేయబోతున్న సినిమాలో బాలయ్యది సింగిల్ రోల్ నే. ఈ విషయాన్ని అనిల్ రావిపూడినే చెప్పారు. 

సాహు గారపాటి నిర్మాణంలో తాను బాలయ్యతో చేస్తున్న సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక్కటే అని, డబుల్ రోల్ కాదని ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’కు ఇచ్చిన ఇంటర్వూల్లో వివరించారు. తన తరహా సినిమాలు, బాలయ్య తరహా సినిమాలు రెండింటినీ సమన్వయం చేస్తూ కథ అల్లుకున్నానని, బాలయ్య క్యారెక్టర్ ఫన్ చేయకపోయినా సినిమాలో ఫన్ జనరేట్ అయ్యేలా కథ రాసుకున్నానని ఆయన వివరించారు.

తన సినిమాల వల్ల ఏ ఒక్క బయ్యర్, ఏ ఒక్క నిర్మాత ఇప్పటి వరకు నష్టపోలేదని, అయినా కూడా తన సినిమాలకు కలెక్షన్లు లేవని, రాలేదని అనడం కామన్ అయిపోయిందని, వరుసగా హిట్ సినిమాలు ఇస్తూ రావడం వల్ల తన మీద జెలసీ పెంచుకున్న వారు చేసే పని అని అనిల్ అన్నారు. 

బాలయ్య సినిమా కు కాస్త గ్యాప్ రావడంతో, తనకు ఇష్టమైన ఫన్ జానర్ కావడంతో ఓ ఓటిటి సంస్థ చేసిన కామెడీ షో కి జడ్జ్ గా వ్యవహరించానని తెలిపారు. ఈ షో కాన్సెప్ట్ నచ్చడంతో చేసానని, ఎంతో మంది యంగ్ కమెడియన్స్ టాలెంట్ ను గమనించానని, తాను కూడా వారితో ఆ షో లో ఇన్ వాల్వ్ అయ్యానని అనిల్ చెప్పారు.

సినిమాల్లో ఫన్ పుట్టించడం అంత సులువు కాదని కమర్షియల్ ట్రంప్లెట్ తో సినిమా తీయడం సులువు అని అన్నారు. ఎంటర్ టైన్ చేయడంలో ఫెయిల్ అయినా బాధ పడక్కరలేదని, నవ్వించే క్రమంలో ఫెయిల్ కావడం తప్ప కాదని అన్నారు. ఒకరిని నవ్వించే పని ఎప్పటికైనా మంచిదే అని అందుకే ఈ జానర్ అంటే తనకు చాలా ఇష్టమని అనిల్ చెప్పారు.