తన నిజజీవితానికి సంబంధించిన ఓ రొమాంటిక్ ఘటనను బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయికి సైట్ కొట్టేవాడినని, తర్వాత అదే అమ్మాయిల బ్యాచ్ లో ఉన్న మరో అమ్మాయితో తనకు పెళ్లయిందనే విషయాన్ని బయటపెట్టాడు.
అనీల్ రావిపూడి, అతడి భార్య ఒకే కాలేజ్ లో చదువుకున్నారట. ఆ టైమ్ లో అనీల్ రావిపూడి, అతడి ఇద్దరు ఫ్రెండ్స్ ప్రతి రోజూ ఓ నలుగురు అమ్మాయిల బ్యాచ్ ను ఫాలో అయ్యేవారంట. వాళ్లలో ఒకమ్మాయిని అనీల్ రావిపూడి చూసేవాడంట. కానీ ఆ అమ్మాయి పడలేదని, ఆ తర్వాత అదే అమ్మాయిల బ్యాచ్ లో ఉండే మరో అమ్మాయితో తనకు పెళ్లి జరిగిందని చెప్పుకొచ్చాడు.
ఇప్పటికీ సందర్భం దొరికిన ప్రతిసారి ఈ విషయంపై అనీల్ రావిపూడి భార్య అతడ్ని ప్రశ్నిస్తుందట. కాలేజ్ డేస్ లో తనను చూడకుండా, తన పక్క ఉన్న అమ్మాయిని చూడడంపై దెప్పిపొడుస్తుందట. ఎఫ్3 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న ఈ దర్శకుడు.. ఇలా తన జీవితంలో జరిగిన ఘటనను బయటపెట్టాడు.
అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఎఫ్3 సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా చేసిన ఈ సినిమాలో తమన్న, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మాత.