Advertisement

Advertisement


Home > Movies - Movie News

దిల్ రాజులో అమలాపురం ఫ్రస్ట్రేషన్

దిల్ రాజులో అమలాపురం ఫ్రస్ట్రేషన్

ఎఫ్-3 అంటూ ఉత్సాహంగా వస్తున్న సినిమా యూనిట్ కి కోనసీమలో కలెక్షన్లు కాస్త టెన్షన్ పెడుతున్నాయి. గోదావరి జిల్లాల కలెక్షన్లపై ఎప్పుడూ టాలీవుడ్ కి భారీ ఆశలు, అంచనాలే ఉంటాయి. ఈసారి ఫ్యామిలీ మూవీ కాబట్టి ఇంకా పెద్ద ఆశ ఉంది. కానీ అమలాపురం హైటెన్షన్ కాస్తా నిర్మాత దిల్ రాజుని టెన్షన్లో పడేస్తోంది.

మరో 2 రోజుల్లో సినిమా రిలీజ్. అప్పటికి పరిస్థితులు సద్దుమణగకపోతే, అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగితే, థియేటర్ల ఓనర్లు గగ్గోలు పెడతారు. దీన్ని ఎలా తట్టుకోవాలా అని దిల్ రాజు టెన్షన్ పడిపోతున్నారు.

తెలుగు రాష్ట్రాలు రెండుగా వేరైన తర్వాత.. రెండు చోట్లా రాజకీయ పరిస్థితులు నాలుగు రకాలుగా మారిపోయాయి. అన్నిటిని బేరీజు వేసుకుని సినిమా విడుదల టైమ్ ఫిక్స్ చేసుకుంటేనే కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ మారిపోవడంతో ఆ ప్రభావం సర్కారువారి పాట సినిమాపై పడిన సంగతి తెలిసిందే.

అయితే అమలాపురం గొడవను ఎవ్వరూ ఊహించలేదు. ఎఫ్3కి అంతా అనుకూలంగా ఉందనుకున్న టైమ్ లో అమలాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సినిమా థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. 144 సెక్షన్ అమలులో ఉంది. అమలాపురంతో పాటు.. కోనసీమ జిల్లాలో కూడా ఉద్విగ్న పరిస్థితులు ఉన్నాయి. ఈ దశలో సినిమా పోస్టర్ వేయాలన్నా కూడా కాస్త టెన్షన్ పడుతున్నారు థియేటర్ యజమానులు.

పరిస్థితులు మారితే ఓకే..?

ఇప్పటికిప్పుడు సినిమా విడుదలైతే.. అమలాపురంలో టికెట్ తెగదు. కోనసీమలో కూడా కలెక్షన్లు ఉండవు. ఎఫ్-3 విడుదలకు ఇంకా 48 గంటల టైమ్ ఉంది. ఈ 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా ఉంది. లేకపోతే మాత్రం ఎఫ్-3కి ఇబ్బందులు తప్పదు. 

ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఉంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో పాటు మోర్ ఫన్ అనుకుంటున్న నిర్మాత దిల్ రాజు కాస్తా.. అమలాపురం ఇష్యూతో మోర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప, ఫన్నా.. ఫ్రస్ట్రేషనా అనేది తేలదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?