Advertisement

Advertisement


Home > Movies - Movie News

అన్నీ థియేటర్ దారిలోనే

అన్నీ థియేటర్ దారిలోనే

కరోనా రెండో విడత కల్లోలం వ్యాపించినా సినిమా జనాలు మాత్రం ఓటిటి వైపు అంత ఆసక్తిగా తొంగి చూడడం లేదు. తొలి విడత టైమ్ లో క్లారిటీ లేదు కానీ తరువాత క్లారిటీ వచ్చింది. ఒకసారి థియేటర్లు ఓపెన్ కాగానే జనాలు సర్రున దూసుకువచ్చారు. కలెక్షన్లు కుమ్మేసాయి. ప్రతి నెల ఒక సినిమా వంతున హిట్ లు వచ్చాయి. ఇప్పుడు రెండోవిడత కరోనా వచ్చినా అదే భరోసాగా వుంది.

అందుకే మీడియం, పెద్ద సినిమాలు ఎవీ ఓటిటి వైపు తొంగి చూడడం లేదు. అయితే ఓటిటి జనాలు మాత్రం ఏ సినిమా అయినా దొరుకుతుందా అని వేటాడుతున్నారు. అయితే విడుదలకు దగ్గరగా వున్న సినిమాలు ఏవీ ఆసక్తి కనబర్చడం లేదు. 

చైతన్య-సాయిపల్లవి ల లవ్ స్టోరీ సినిమాను ఓటిటికి ఇవ్వమని అడుగుతున్నా, నిర్మాతలు సుముఖంగా లేరు. అలాగే రవితేజ-రమేష్ వర్మల ఖిలాడీ సినిమా కూడా అదే రీతిగా వుంది. పైగా ఈ సినిమాకు వర్క్ ఇంకా వుంది. అందువల్ల అదీ ఓటిటికి దూరంగానే వుంది. సాయిధరమ్ రిపబ్లిక్ ను ఇప్పటికే జీటీవీ తీసుకుంది. థియేటర్ కు వేస్తుందా? డైరక్ట్ గా విడుదల చేస్తుందా అన్నది చూడాలి.

శౌర్య సినిమాలు వరుడు కావాలి, లక్ష్య రెండూ దాదాపు పూర్తయిపోయాయి. మహా అయితే వన్ వీక్ వర్క్ పెండింగ్ వున్నాయి రెండింటికీ. ఈ రెండూ కూడా థియేటర్ కు రిజర్వ్ అన్నట్లు వున్నాయి. మిడ్ రేంజ్ హీరోల సినిమాలు చాలా వరకు షూట్ లో వున్నాయి. ఫినిషింగ్ స్టేజ్ లో లేవు. అందువల్ల కూడా ఓటిటి కి దూరంగా వున్నాయి.

మొత్తం మీద ఈసారి ఓటిటికి వెళ్లేందుకు మీడియం, లేదా పెద్ద సినిమాలు ఏవీ రెడీగా లేవు. పైగా సినిమా జనాలకు జూన్ నుంచి అంతా సజావుగా మారుతుందని, జూలై లేదా ఆగస్టు నుంచి థియేటర్లు తెరచుకుంటాయని ధీమాగా వుంది. అందువల్ల ఇప్పట్లో ఓటిటి ల్లో ఆసక్తిగా ఎదురుచూసేంత సినిమాలు ఏవీ వుండవనే అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?