టాలెంట్ ఉండాలే కానీ కోట్లలో జీతం సంపాదించడం పెద్ద సమస్య కాదని ఇప్పటికే చాలామంది నిరూపించారు. కళ్లు చెదిరే ఆఫర్లు అందుకొని వార్తల్లోకెక్కారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన అమ్మాయి ఇదే కోవలో ఓ ఘనత సాధించింది. మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించిన ఈ అమ్మాయి ఏడాది జీతం అక్షరాలా 2 కోట్ల రూపాయలు.
హైదరాబాద్ కు చెందిన దీప్తి కంప్యూటర్స్ లో ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత జేపీ మోర్గాన్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేరింది. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అమెరికా వెళ్లి ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసింది.
అక్కడే జరిగిన క్యాంపస్ సెలక్షన్ లో మైక్రో సాఫ్ట్ కు ఎంపికైంది. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి 300 మంది క్యాంపస్ సెలక్షన్ లో సెలక్ట్ అయితే.. వీళ్లలో హయ్యస్ట్ శాలరీ దీప్తిదే. ఈమె టాలెంట్ ను గుర్తించిన మైక్రోసాఫ్ట్.. సాఫ్ట్ వేర్ డెలవప్ మెంట్ ఇంజనీర్ గ్రేడ్-2లో ఉద్యోగం ఇచ్చి 2 కోట్ల రూపాయల ప్యాకేజీ ఆఫర్ చేశారు.
ఈనెల 2వ తేదీతో దీప్తి ఎమ్మెస్ పూర్తయింది. ఇదే నెలలో ఆమె మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్ లో జాయిన్ అవ్వబోతోంది.