వర్మ బాధితులు ఆయనపై రీవేంజ్ తీర్చుకుంటూ ఉన్నారు. సినిమా మీద సినిమాలు అనౌన్స్ చేస్తూ వీళ్లు ఆర్జీవీ పై సినిమాల నంబర్ ను పెంచేస్తూ ఉన్నారు. తాజాగా ఒక సినీ క్రిటిక్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఆర్జీవీ తీసిన ఒక సినిమా సమయంలో ఈ క్రిటిక్ కూ, ఆ దర్శకుడికి మధ్యన ఒక గొడవలాంటిది జరిగింది.
ఒక టీవీ చానల్ డిబేట్ లో ఏదో అరుచుకున్నట్టుగా, ఆ తర్వాత వీళ్లిద్దరూ రాజీ అయినట్టుగా కూడా ప్రకటనలు చేసుకున్నారు. అదే సినిమాకు సక్సెస్ మీట్ జరిగితే దానికి ఆ క్రిటిక్ హాజరయ్యి వర్మపై ప్రశంసలు కురిపించాడు.
ఇప్పుడేమో ఆర్జీవీ చీడపురుగు అన్నట్టుగా సదరు వ్యక్తి సినిమాను అనౌన్స్ చేశాడు. వర్మ పేరును కాస్త అటూ ఇటూ చేసి సినిమా టైటిల్ ను ప్రకటించారు. వర్మ పేరు పొడుగ్గా ఉండటంతో వీళ్లందరికీ దాన్ని ట్విస్ట్ చేయడానికి అవకాశం లభిస్తున్నట్టుగా ఉంది.
ఒకసారి వర్మ టీవీ లైవ్ షోలో ఒక మహిళోద్యమకారణిపై సెటైర్లు వేశాడు, ఆమె చేత పోస్టర్ విడుదల చేయించినట్టుగా ఉన్నారు. మొత్తానికి వర్మ బాధితులంతా పోస్టర్లతో కసి తీర్చుకుంటున్నట్టుగా ఉన్నారు. ఎలాగూ ఈ సినిమాలేవీ జనాలు పట్టించుకునేవి కావు!