మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22)ను పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో చిరంజీవికి మంచి సంబంధాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి అజాతశత్రువు. రాజకీయా లకు అతీతంగా ఆయన్ను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు. చిరంజీవికి వచ్చిన విషెస్‌లో ఆయన కోడలు, రాంచరణ్ భార్య కొణిదెల ఉపాసన ఎమోషనల్ ట్వీట్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి.
సహజంగానే ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఏ విషయంపైనైనా తన అభిప్రాయాలను నిర్మొహమా టంగా, సూటిగా, స్పష్టంగా చెప్పడం ఆమె నైజం. ప్రజల్ని చైతన్యపరచాలని ఆమె తపిస్తుంటారు. కరోనా గురించి సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పెద్ద క్యాంపెయిన్ నిర్వహించారని చెప్పాలి.
ప్రస్తుతానికి వస్తే తన మామ మెగాస్టార్ పుట్టిన రోజును పురస్కరించుకుని భావోద్వేగమైన , స్ఫూర్తిదాయకమైన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి దిగిన ఫొటోనూ కూడా షేర్ చేశారు. చిరంజీవితో పాటు ఉపాసన వ్యక్తిత్వాన్ని మరో మెట్టు పైకి ఎక్కించే ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.
‘అవిశ్రాంత కృషీవలుడు, గొప్ప నమ్మకం ఉన్న వ్యక్తి. దయార్థ హృదయం, అన్ని సమయాల్లో మానసిక ధైర్యంతో ఉండే వ్యక్తి ఆయన. ఆయన్ని నేను మామయ్య అని పిలిస్తే.. ప్రపంచం మెగాస్టార్ అని పిలుస్తోంది’ అని ఉపాసన మనసును టచ్ చేసేలా ట్వీట్ చేశారు. అలాగే మీరంటే స్ఫూర్తి, ఆరాధనభావం ఎప్పటికి ఉంటుందంటూ తన మామయ్యపై ప్రేమానురాగాలను కురిపిస్తూ ఉపాసన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కోడలి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.