దురదృష్టం ఆ హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది

కొంతమంది అంతే. బోలెడంత అందం ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం లేక కిందామీద పడుతుంటారు. హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ విషయంలో కూడా ఇప్పుడిదే జరుగుతోంది. ఈ అమ్మాయి గ్లామర్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిందేం లేదు.…

కొంతమంది అంతే. బోలెడంత అందం ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం లేక కిందామీద పడుతుంటారు. హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ విషయంలో కూడా ఇప్పుడిదే జరుగుతోంది. ఈ అమ్మాయి గ్లామర్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఎటొచ్చి ఆమెకు అదృష్టం కలిసిరావడం లేదు.

ఎంత పెద్ద క్రేజీ ప్రాజెక్టులో నటించినా అను ఎమ్మాన్యుయేల్ కు కలిసిరావడం లేదు. తాజాగా దీనికి మరో ఉదాహరణగా నిలిచింది జపాన్ సినిమా. కార్తి హీరోగా నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలుండేవి. కానీ రిలీజైన తర్వాత సినిమా తేలిపోయింది.

తమిళనాట జపాన్ కంటే జిగర్ తాండా-2కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇక తెలుగులో జపాన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో అను ఎమ్మాన్యుయేల్ కు మరో ఫ్లాప్ తప్పలేదు. జపాన్ పై చాలా హోప్స్ పెట్టుకుంది అను. కానీ ఆమె ఆశలు గల్లంతయ్యాయి.

కెరీర్ స్టార్టింగ్ నుంచి అను ఎమ్మాన్యుయేల్ ఇలా దురదృష్టాన్ని వెంటేసుకొని తిరుగుతోంది. ఏకంగా బన్నీ లాంటి స్టార్ సైతం ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాడు. కనీసం కార్తి అయినా తనకు హిట్టిస్తాడని ఆశపడింది అను. కానీ ఆమె ఆశ నెరవేరలేదు.

ఇప్పటికే ఆమెపై ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా అదే రిపీటైంది.