Advertisement

Advertisement


Home > Movies - Movie News

అను ఎమ్మాన్యుయేల్ మౌనం వెనక కారణం ఏంటి?

అను ఎమ్మాన్యుయేల్ మౌనం వెనక కారణం ఏంటి?

ఒకప్పట్లా ఇప్పుడు హీరోయిన్లు మౌనంగా ఉండడం లేదు. తమపై ఏదైనా పుకారు వస్తే వెంటనే క్లారిటీ ఇస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న హీరోయిన్లు... తమ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి పుకార్లకు ఆస్కారం ఇవ్వడం లేదు. అయితే అను ఎమ్మాన్యుయేల్ మాత్రం దీనికి రివర్స్ లో వెళ్తోంది.

కొన్ని రోజులుగా ఈ ఎన్నారై బ్యూటీపై పుకార్లు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో అను చాలా దూరం వెళ్లిందని, ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో మునిగిపోయాని గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడితో ఈ ప్రచారం ఆగలేదు. వీళ్లిద్దరూ పెళ్లి వరకు వెళ్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఓవైపు తనపై ఇంత ప్రచారం సాగుతున్నప్పటికీ అను ఎమ్మాన్యుయేల్ మాత్రం సైలెంట్ అయింది. దీనికి మరింత ఊతమిస్తూ.. ఆమె 3 రోజులుగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఎలాంటి అప్ డేట్స్, కొత్త ఫొటోలు అందించడం లేదు.

దీంతో గాసిప్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. మౌనం అర్థాంగీకారం అంటూ అను ఎఫైర్లపై మరిన్ని కథనాలు వండివారుస్తున్నారు. రీసెంట్ గా అల్లుడు అదుర్స్ సినిమాలో నటించింది అను. అది కాస్తా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం మహాసముద్రం సినిమాపై పెట్టింది ఈ బ్యూటీ. 

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?