కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ కూడా చేరింది. తనకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఒప్పుకుంది అను ఇమ్మాన్యుయేల్.
కెరీర్ స్టార్టింగ్ లో ఓ నిర్మాత అను ఇమ్మాన్యుయేల్ దగ్గరకు వచ్చాడట. ఓ సినిమా ఆఫర్ ఇస్తూనే, కాస్త 'ఎడ్జెస్ట్' అవ్వాలని డిమాండ్ చేశాడట. ఇలా నేరుగానే తన ముందు ప్రపోజల్ పెట్టాడని, కానీ దాన్ని తను తెలివిగా తిరస్కరించానని చెప్పుకొచ్చింది.
కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎదురైనప్పుడు భయపడకూడదంటోంది అను. అలాంటి సందర్భాల్లో ఒంటరిగా ఉండే బదులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని సూచిస్తోంది. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ ఘటనను కూడా కుటుంబసభ్యుల సహకారంతో ఎదుర్కొన్నట్టు వెల్లడించింది.
ప్రస్తుతం కార్తి సరసన జపాన్ అనే సినిమాలో నటిస్తోంది అను ఇమ్మాన్యుయేల్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె బయటపెట్టింది. అయితే ఆ నిర్మాత ఎవరనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు.
ఈ సందర్భంగా అల్లుశిరీష్ తో తన బంధాన్ని కూడా బయటపెట్టింది అను ఇమ్మాన్యుయేల్. శిరీష్, తను డేటింగ్ లో ఉన్నట్టు వార్తలొచ్చాయని, ఆ వార్తల్ని స్వయంగా తన తల్లి తనకు చెప్పిందని తెలిపింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.
మజ్ను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌంది అను ఇమ్మాన్యుయేల్. తెలుగులో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసింది.