‘అనుభవం’ బాగానే వుంది

హీరో రాజ్ తరుణ్ సరైన సినిమా పడక, సరైన హిట్ దొరక్క కిందా మీదా అవుతున్నాడు. అతని సమస్య తీరిపోయేటట్లే కనిపిస్తోంది.  Advertisement అన్నపూర్ణ బ్యానర్ మీద రైటర్ గవిరెడ్డి శ్రీనివాస్ డైరక్షన్ లో…

హీరో రాజ్ తరుణ్ సరైన సినిమా పడక, సరైన హిట్ దొరక్క కిందా మీదా అవుతున్నాడు. అతని సమస్య తీరిపోయేటట్లే కనిపిస్తోంది. 

అన్నపూర్ణ బ్యానర్ మీద రైటర్ గవిరెడ్డి శ్రీనివాస్ డైరక్షన్ లో నిర్మించే సినిమా అనుభవించు రాజా. ఈ సినిమా టీజర్ విడుదలయింది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమా టీజర్ చూస్తుంటే పక్కా ప్రామిసింగ్ కా గనిపిస్తోంది.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా, ఫన్ పండించే డైలాగ్స్ తో ట్రయిలర్ ను కట్ చేసారు. గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు వుండే మైనర్ బాబు టైపు క్యారెక్టర్ లో రాజ్ తరుణ్ కనిపించాడు. రామ్ చరణ్ ఈ టీజర్ ను ఆన్ లైన్ లోకి విడుదల చేసారు. 

దర్శకుడు గవిరెడ్డి శ్రీనివాస్ రాసుకున్న డైలాగులు బాగున్నాయి. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ చెప్పిన తీరు, గెటప్, పండించిన ఫన్ కూడా బాగుంది. టోటల్ గా సినిమాకు ఈ టీజర్ ఓ ప్రామిసింగ్ లుక్ తీసుకువచ్చింది.