సోలో ఇమేజ్ కోసం హీరోయిన్ విశ్వప్రయత్నం

కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త కొత్తగా ప్రయత్నిస్తోంది అనుపమ పరమేశ్వరన్. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాకుండా, కంటెంట్ ఉన్న కథల్ని అంగీకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కొన్ని విజయాలతో పాటు, మరికొన్ని ఫ్లాపులు కూడా…

కెరీర్ స్టార్టింగ్ నుంచి కాస్త కొత్తగా ప్రయత్నిస్తోంది అనుపమ పరమేశ్వరన్. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాకుండా, కంటెంట్ ఉన్న కథల్ని అంగీకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కొన్ని విజయాలతో పాటు, మరికొన్ని ఫ్లాపులు కూడా అందుకుంది. అదే టైమ్ లో స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు కూడా మిస్సయింది.

ఇప్పుడీ ముద్దుగుమ్మ సోలో హీరోయిన్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తోంది. నయనతార, అనుష్క, సమంత స్థాయిలో కాకపోయినా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు తను కూడా ఓ ఆప్షన్ గా నిలవాలనుకుంటోంది.

ఈ దిశగా ఇప్పటికే బట్టర్ ఫ్లై అనే సినిమా చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అయితే థియేటర్లలో రిలీజ్ అవ్వకపోవడం అనుపమకు మైనస్ గా మారింది. అటు ఓటీటీలో కూడా దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

అయినప్పటికీ అనుపమ పరమేశ్వరన్ తన ప్రయత్నాలు ఆపలేదు. ఇప్పుడు అదే కోవలో మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసారి లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బ్యానర్ సపోర్ట్ ఈమెకు దక్కింది. మరో 2 రోజుల్లో సినిమా లాంఛ్ కూడా అవుతుంది.

లైకా బ్యానర్ కాబట్టి ఈసారి థియేట్రికల్ రిలీజ్ కు ఢోకా లేదు. సో.. ఈ సినిమా క్లిక్ అయితే కెరీర్ లో మరిన్ని ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనుకుంటోంది ఈ బ్యూటీ. నయనతార, అనుష్క రేంజ్ లో ఆమె క్రేజ్ తెచ్చుకుంటుందా లేదా అనేది ఆమె భవిష్యత్ చిత్రాలు నిర్ణయిస్తాయి.