అనుష్క కోసం చాలా టైమ్

యువి సంస్థ నవీన్ పోలిశెట్టి-అనుష్క కాంబినేషన్ లో నిర్మిస్తున్న శెట్టి-శెట్టి సినిమా టీజర్ అయితే బయటకు వచ్చింది. ఓకె అనిపించుకుంది. కానీ సినిమా విడుదల ఎప్పుడు అన్నది మాత్రం క్వశ్చను మార్కే. ఈ నెల…

యువి సంస్థ నవీన్ పోలిశెట్టి-అనుష్క కాంబినేషన్ లో నిర్మిస్తున్న శెట్టి-శెట్టి సినిమా టీజర్ అయితే బయటకు వచ్చింది. ఓకె అనిపించుకుంది. కానీ సినిమా విడుదల ఎప్పుడు అన్నది మాత్రం క్వశ్చను మార్కే. ఈ నెల 26న విడుదల అనుకున్నారు. కానీ అది పాజిబుల్ కావడం లేదు. సినిమా రెడీనే. కానీ అనుష్క తో సమస్య. అంటే అనుష్క కోపరేట్ చేయకపోవడం కాదు. సిజి వర్క్ సాయంతో అనుష్క బాడీ షేపింగ్ అనేది సమస్య.

ఇప్పుడు సినిమాలు అన్నింటిలో హీరోల బాడీ షేపింగ్ అన్నది కామన్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు దీని కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. లావుగా వున్నవారిని సన్నగా చెక్కేయాలి. తెల్లగా చూపించాలి. కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు మాయం చేయాలి. ఇలా చాలా అంటే చాలా చేస్తే అప్పుడు హీరోలు తెరమీద భలే అందంగా వున్నారు కదా అని అనిపించుకుంటారు.

బాహుబలి తరువాత అనుష్క బాగా లావుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫేస్ కూడా బాగా చబ్బీగా మారిపోయింది. ఇప్పుడు ఈ శెట్టి..శెట్టి సినిమా కోసం సిజి వర్క్ బాగా వాడి, టోటల్ లుక్ ను ఓ లెవెల్ కు తీసుకురావాల్సి వుంది. దానికి కాస్త ఎక్కువ టైమ్ నే పడుతోంది. అందువల్ల మే 26 కు విడుదల పాజిబుల్ కాదు.

ఒకటి రెండు వారాల తరువాత విడుదల చేద్దామంటే ఆదిపురుష్ సినిమా వుంది. దాన్ని తెలుగులో యవి సంస్థనే అందిస్తోంది. అందువల్ల ఇక జూలై కు వెళ్లిపోవాల్సిందే. కానీ జూలై అంత గొప్ప సీజన్ కాదు సినిమాలకు. అంటే మళ్లీ ఆగస్టుకు వెళ్లాలి. చూడాలి మరి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?