హీరోయిన్ అనుష్క శర్మ మరోసారి తల్లి కాబోతోందనే ఊహాగానాలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లికి కొంతమంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు. అయితే తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
అయితే వీళ్ల ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని ఫిక్స్ అయిపోయారు. దీనికి కారణం తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో. భర్త కోహ్లీతో కలిసి ఓ స్టార్ హోటల్ నుంచి బయటకొచ్చింది అనుష్క శర్మ. అందులో ఆమె గర్భంతో కనిపించింది. అంతేకాదు, ఫొటోలకు కనిపించకుండా ఉండడానికి నానా తంటాలు పడింది కూడా.
ఈ ఒక్క వీడియోతో అంతా ఫిక్స్ అయిపోయారు. విరాట్-అనుష్కకు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది అనుష్క. అందుకే ఆమె కెమెరాకు కనిపించకుండా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. ప్రాజెక్టులు కూడా తగ్గించేసింది.
2017లో అనుష్క-విరాట్ పెళ్లి చేసుకున్నారు. 2021లో ఈ జంటకు కూతురు వామిక పుట్టింది. ఇప్పుడు మరోసారి ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.
ప్రస్తుతం విరాట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అటు అనుష్క శర్మ కూడా నటిగా, నిర్మాతగా ఓటీటీలో బిజీగా ఉంది. ఇప్పుడీ ఇద్దరూ రెండో బిడ్డను తమ జీవితాల్లోకి ఆహ్వానించేందుకు, కాస్త విరామం తీసుకోబోతున్నారు.