మరో వారంలో జనాల ముందుకు రాబోతోంది మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇప్పటికి ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ ఓ థియేటర్ లో చేసారు. హీరో, డైరక్టర్ మీడియా ఇంట్రాక్షన్లు మామూలే. ఆ పైన ఇంకేం వుంది. హీరో నవీన్ పోలిశెట్టి ఊళ్ల యాత్ర మామూలే. తిరుగుడే తిరుగుడు. కానీ ఈ టోటల్ సినేరియాలో హీరోయిన్ అనుష్క ఎక్కడ? ఆమె ఎందుకు అస్సలు బయటకు రావడం లేదు? కనీసం ఓ ఫంక్షన్ కు అయినా రావచ్చు కదా? కానీ రారట.
అందుకే అసలు ఈ సినిమాకు ప్రి రిలీజ్ ఫంక్షన్ కూడా చేయకుండా వుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారట. తీరా చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే, హీరోయిన్ రాకపోతే అంత బాగోదు అని భావిస్తున్నారు. ఇక మీడియా మీట్‌లు వుండనే వుండవు. అలా పెడితే హీరోయిన్ బయట కనిపించేయాల్సి వస్తుంది కదా? అందుకనే హీరోయిన్ మీడియా మీట్ లు వుండవు
ఎఫ్ ఎమ్ లకు మాత్రం ఇంటర్వూలు ఇస్తారట. ఎందుకంటే అవి ఫోన్ లోనే కదా..ఫేస్ చూపించనక్కరలేదు. ఓ హీరోయిన్ సినిమాలో నటించి, ఫేస్ చూపించిన తరువాత కనీసం ఓ ప్రెస్ మీట్ కు కూడా ఫేస్ చూపించను అంటారేంటీ? అందులో మతలబు ఏమిటి? పోనీ అనుష్క ది ఏమన్నా అందమైన ఫేస్ కాదా అంటే అందానికే అందం కదా? మరెందుకు చూపించరు?
అంటే చూస్తే ఆమె లుక్స్ తెలిసిపోతాయనా? ఇటీవల బాగా లావు అయ్యారు అన్న గ్యాసిప్ లు మరోసారి వినిపిస్తాయనా? మరేంటీ? ఏదో వుంది.. సమ్ థింగ్.. సమ్ థింగ్… అసలు శెట్టి.. పోలిశెట్టి సినిమా థియేటర్ లోకి రావడం వెనుక అనుష్క ఫిజిక్ ను తెరమీద పెర్ ఫెక్ట్ గా కనిపంచడం కోసం సిజి పనులు చేయడం వల్లనే అనే గ్యాసిప్ లు కూడా వున్నాయి.
ఇప్పుడు ఏ రిలీజ్ లకు రాను.. ఏ మీట్ లకు వచ్చి మొహం చూపించరు అనే వార్తలు వస్తున్నాయి అంటే ఆ గ్యాసిప్ లు నిజమని అనుకోవాలేమో?