ఎప్పుడో కాదు ఇప్పుడే ఓటీటీలోకి

ఓటీటీ కోసమే ఈ సినిమాను ఇంత ఫాస్ట్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మిస్సయితే మళ్లీ డేట్ లేదు

“ఓటీటీ కోసమే ఈ సినిమాను ఇంత ఫాస్ట్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మిస్సయితే మళ్లీ డేట్ లేదు. అమెజాన్ వాళ్లు నెలకు ఓ సినిమా పెట్టుకుంటున్నారు. అలా చూసుకుంటే, ఏప్రిల్-మే వరకు మా సినిమాకు స్లాట్ లేదు. వాళ్లు డిసెంబర్ చివరి నాటికి రిలీజ్ చేయాలని అడిగారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను విడుదల చేస్తున్నాం.”

ఇలా సినిమా విడుదలకు ముందే దర్శకుడు సుధీర్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. చెప్పినట్టుగానే క్యాలెండర్ తిరక్కముందే “అప్పుడో ఇప్పుడు ఎప్పుడో” సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా రిలీజైనట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. ప్రచారం లేకపోయినా మౌత్ టాక్ తో తమ సినిమా నిలబడుతుందని మేకర్స్ గొప్పగా చెప్పినప్పటికీ, అక్కడ అంత సీన్ లేదు. రిలీజైన రోజే ఫ్లాప్ అయిన సినిమా ఇది.

అలా మొదటి మూడు రోజులు కూడా ఆడని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇలాంటి సినిమాల్ని ఎలా ట్రీట్ చేయాలో ఓటీటీ జనాలకు బాగా తెలుసు. అందుకే ఎలాంటి ఆర్భాటం లేకుండా, సింపుల్ గా ఓ పోస్ట్ పెట్టి స్ట్రీమింగ్ పెట్టారు.

మొత్తానికి నిఖిల్ కెరీర్ లో మరో సినిమా చప్పుడు లేకుండా చప్పగా ముగిసిపోయింది. ఇంతకుముందు ‘స్పై’ విషయంలో కూడా ఇలానే జరిగింది. కార్తికేయ-2 లాంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత నిఖిల్ కెరీర్ లో ఇలా జరగడం ప్లానింగ్ లోపమే అనుకోవాలి.

2 Replies to “ఎప్పుడో కాదు ఇప్పుడే ఓటీటీలోకి”

Comments are closed.