తన పెళ్లిపై ఎట్టకేలకు బయటపడింది హీరోయిన్ కీర్తిసురేష్. కాకపోతే పూర్తిగా కాదు. కొంచెం మాత్రమే వెల్లడించింది. ఆంటోనీ అనే పేరును తొలిసారి ప్రస్తావించిన కీర్తిసురేష్, అతడితో 15 ఏళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉంటున్నట్టు వెల్లడించింది.
డిసెంబర్ 11న కీర్తిసురేష్, తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ ను పెళ్లి చేసుకోబోతోంది. గోవాలోని ఓ ఖరీదైన రిసార్ట్ లో వీళ్ల పెళ్లి గుంభనంగా జరగనుంది. ఎక్కువగా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్న ఈ వేడుకకు, అతికొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే వస్తున్నారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది కీర్తిసురేష్. ఆమె పెంపుడు కుక్క పేరు నైక్. ఆ పేరు ఎలా వచ్చిందో వెల్లడించింది. ఆంటోనీలో చివరి రెండు అక్షరాలు, తన పేరులో తొలి 2 అక్షరాలు కలిపి నైక్ (NYKE) అనే పేరు పెట్టినట్టు పరోక్షంగా బయటపెట్టింది.
మొత్తానికి కొన్నేళ్లుగా నడుస్తున్న కీర్తిసురేష్ పెళ్లి వ్యవహారం ఈ ఏడాది చివరితో కొలిక్కి వచ్చినట్టయింది.
కీర్తి సురేష్, ఆమె కాబోయే భర్త ఆంటోనీ తటిల్ హైస్కూల్ డేస్ నుంచి ప్లస్ టు వరకు కలిసి చదువుకున్నారు. ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలో పలు వ్యాపారాలున్నాయి. అమెరికాలో చదువుతున్న టైమ్ లోనే కీర్తిసురేష్ కు ప్రపోజ్ చేశాడు ఆంటోనీ. అప్పట్నుంచి ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. కలవాలనుకున్నప్పుడల్లా అమెరికా నుంచి అతడు, ఇండియా నుంచి ఈమె దుబాయ్ వెళ్లి కలుసుకునేవాళ్లు.
vc available 9380537747
vc estanu 9380537747
kerala లొ వుండి మరక జాతి నుండి తప్పించుకున్నావ్ ..but..గొర్రె బిడ్డకు దొరికిపొయావ్
😁😁😁😁😂😂😁😁😁
Call boy jobs available 7997531004