ఏప్రిల్ 22న శౌర్య సినిమా

వరుడు కావలెను అంటూ మంచి సినిమా అందించిన హీరో నాగశౌర్య మరో మంచి టైటిల్ తో, మంచి సబ్ఙెక్ట్ తో వస్తున్నాడు. కృష్ణ వృింద విహారి అనే టైటల్ లో మాంచి ఎంటర్ టైన్…

వరుడు కావలెను అంటూ మంచి సినిమా అందించిన హీరో నాగశౌర్య మరో మంచి టైటిల్ తో, మంచి సబ్ఙెక్ట్ తో వస్తున్నాడు. కృష్ణ వృింద విహారి అనే టైటల్ లో మాంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఫినిష్ చేసాడు. 

శౌర్య స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తునట్లు నిర్మాత ఉష మాల్పూరి ప్రకటించారు. ప్రస్తుతానికి ఆ డేట్ కు మరే సినిమా లేదు. పైగా సమ్మర్ హాలీడేస్ పెర్ ఫెక్ట్ గా స్టార్ట్ అవుతున్నది అప్పుడే. 

అందుకే ఆ డేట్ ను ఎంచుకున్నారు. ఈ సినిమాలో కథ అంతా ఓ సంప్రదాయ బ్రాహ్మిణ్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సీనియర్ హీరోయిన్ రాధిక కీలకపాత్ర పోషిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఓ మాంచి మండువా లోగిలి సెట్ లో ఈ సినిమాను షూట్ చేసారు.

శౌర్య సరసన మోడరన్ అమ్మాయిగా షిర్లె శెటియా నటించింది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ వంటి మాంచి ప్యాడింగ్ వున్న ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.