ఏప్రిల్ 30 కి లక్ష్య?

సునీల్ నారంగ్, శరత్ మరార్ నిర్మించిన సినిమా లక్ష్య. నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈ రోజే విడుదలయింది.  Advertisement టీజర్ కు మాంచి స్పందన రావడంతో విడుదల…

సునీల్ నారంగ్, శరత్ మరార్ నిర్మించిన సినిమా లక్ష్య. నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈ రోజే విడుదలయింది. 

టీజర్ కు మాంచి స్పందన రావడంతో విడుదల డేట్ కూడా దాదాపు ఫిక్స్ చేసుకున్నారు. ఏప్రిల్ 30న లక్ష్యను విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

అయితే మెగాస్టార్ ఆచార్య సినిమా ను మే 5న విడుదల చేస్తారని టాక్ వుంది. కానీ లక్ష్య నిర్మాతలు మాత్రం ఏప్రిల్ 30 కే రావాలని డిసైడ్ అయినట్లు బోగట్టా. 

నిర్మాతలకు నైజాంలో మెజారిటీ థియేటర్లు చేతిలో వుండడం, ఆంధ్రలో కూడా పలు జిల్లాల్లో థియేటర్లతో టైఅప్ వుండడంతో సమస్య లేదు. కానీ వన్ వీక్ లో భారీ సినిమా వుంటే కలెక్షన్లు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం వుంది. 

బహుశా ఆచార్య ఆ డేట్ కు రావడం కష్టమనే అంచనా ఏమైనా వుందేమో తెలియాల్సి వుంది. బహుశా మే 8కి ఆచార్య వస్తే పది రోజులు టైమ్ సరిపోతుందనే భావన కావచ్చు. 

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే