రామ్ గోపాల్ వర్మ వెలుగులోకి తీసుకొచ్చిన హాట్ బ్యూటీ అప్సర రాణి. ఆమెను తనే కనిబెట్టినట్టు అప్పట్లో తెగ బిల్డప్ ఇచ్చుకున్నారు వర్మ. కానీ అసలు మేటర్ ఏంటంటే, అప్పటికే ఆమె ఫ్లాప్ హీరోయిన్. దాదాపు ఇంటికెళ్లిపోయింది. ఆ టైమ్ లో తన సినిమాతో ఆమెను లైమ్ లైట్లోకి తీసుకొచ్చాడు. అప్సర రాణితో అందాల ఆరబోయించి ఆమెను ఐటెంభామగా మార్చేశాడు.
అలా తన అందచందాలతో ఐటెం భామగా కొనసాగుతున్న అప్సర రాణి, ఇప్పుడు మరోసారి సోలో హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అప్సర రాణిని హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా ప్రకటన వచ్చేసింది. దీనికి తలకోన అనే టైటిల్ కూడా పెట్టారు.
అప్సర రాణిలో అందాలు, హొయలు తప్ప నటనను ఎవ్వరూ పెద్దగా చూడలేదు. అయితే తలకోనలో మాత్రం ఆమెలో కొత్త యాంగిల్ చూస్తారంటున్నారు మేకర్స్. ఆమెలో మంచి నటి కూడా ఉందని పక్కనే ఉన్న బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
తాజాగా మంచు విష్ణు కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ఐటెంభామగా కొనసాగుతున్న సన్నీ లియోన్ లో మహానటి కూడా ఉందనే విషయాన్ని జిన్నా సినిమాతో చాటిచెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అప్సర రాణిపై కూడా అలాంటి ప్రయోగమే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
ఈ సంగతి పక్కనపెడితే, అప్సర మాత్రం తనకొచ్చిన తాజా ఆఫర్ తో ఎగిరి గంతేస్తోంది. ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంట.