టీవీలో ఆచార్య హిట్.. ఈ ప్రచారంలో నిజమెంత?

మెగాభిమానులంతా ఒక్కసారిగా సోషల్ మీడియాలోకొచ్చారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను మరోసారి పొగడ్డం ప్రారంభించారు. బాస్ సినిమా రికార్డులు సృష్టించిందని పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? Advertisement చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య…

మెగాభిమానులంతా ఒక్కసారిగా సోషల్ మీడియాలోకొచ్చారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాను మరోసారి పొగడ్డం ప్రారంభించారు. బాస్ సినిమా రికార్డులు సృష్టించిందని పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది?

చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా టీవీల్లో ప్రసారమైంది. దీపావళి కానుకగా టీవీల్లో వచ్చిన ఈ మూవీకి 6.30 టీఆర్పీ వచ్చింది. ఇది చాలా పెద్ద నంబర్ అంటూ మోస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ఆచార్య సినిమా థియేటర్లలో ఫెయిలైంది. బయ్యర్లను భారీ నష్టాలు మిగిల్చింది. ఈ విషయాన్ని చిరంజీవి కూడా ఒప్పుకున్నారు. తను, రామ్ చరణ్ కలిసి నష్టాల్ని భర్తీ చేశామని కూడా ప్రకటించుకున్నారు. అలా డిజాస్టర్ అయిన సినిమా బుల్లితెరపై హిట్ అయిందని చెప్పే ప్రయత్నం చేశారు ఫ్యాన్స్. కానీ అది నిజం కాదు.

ఆచార్య సినిమాకు వచ్చిన టీఆర్పీ ఏమంత చెప్పుకోదగ్గ రేటింగ్ కాదు. రీసెంట్ గా టీవీల్లో ప్రసారమైన సినిమాల్నే తీసుకుంటే.. బంగార్రాజు (14), అఖండ (13.3), ఎఫ్3 (8.2) సినిమాలకు ఆచార్య కంటే మెరుగైన రేటింగ్ వచ్చింది. అయితే చిరంజీవి గత చిత్రం సైరాతో పోల్చి చూసుకుంటే మాత్రం ఆచార్య కు మంచి టీఆర్పీ వచ్చినట్టే లెక్క.