ఒకవైపు భర్తతో అధికారికంగా విడిపోయింది మలైకా ఆరోరా. విడాకులకు ముందు నుంచినే ఈమెకు అర్జున్ కపూర్ తో రిలేషన్ ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. అర్బాజ్ ఖాన్- మలైకాలు విడిపోకుండా చూడటానికి సల్మాన్ ఖాన్ కూడా చాలా ప్రయత్నాలు చేశాడంటారు. అయితే ఈ జంట రెండేళ్ల కిందటే అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయింది.
ఇక విడాకుల తర్వాత అర్జున్ కపూర్ తో హ్యాపీగా తిరుగుతూ ఉంది మలైకా. అతడితో కలిసి ఈమె ఫారెన్ టూర్లకు కూడా వెళ్లింది. తరచూ వారిద్దరూ కలిసి కనిపిస్తూ ఉంటారు మీడియా కళ్లకు.
ఆ సంగతలా ఉంటే.. మరోసారి అర్బాజ్ ఖాన్ తో కలిసి కనిపించింది మలైకా. అది తనయుడి పుట్టిన రోజు వేడుకలో. వీరిద్దరి తనయుడు అర్హాన్ ఖాన్ పదిహేడవ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఆ పార్టీలో అర్బాజ్-మలైకా ఇద్దరూ కనిపించారు.
అలాగే అమృతా ఆరోరా కూడా ఆ పార్టీకి హాజరైంది. విడాకుల తర్వాత వివిధ సందర్భాల్లో అర్బాజ్-మలైకాలు జంటగా కనిపించారు. విడాకులు అయినా తల్లిదండ్రుల-బంధువులుగా మాత్రం వీరు కొనసాగుతున్నట్టుగా ఉన్నారు!