తెలుగు తెరపైకి మరో నటవారసురాలు

నటవారసత్వంగా హీరోలు వస్తుంటారు కానీ హీరోయిన్లు తక్కువ. సౌత్ లో అయితే ఈ పోకడ మరీ తక్కువ. ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి నిహారిక వచ్చింది. ప్రియదర్శన్-లిజిల కూతురు కల్యాణి…

నటవారసత్వంగా హీరోలు వస్తుంటారు కానీ హీరోయిన్లు తక్కువ. సౌత్ లో అయితే ఈ పోకడ మరీ తక్కువ. ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి నిహారిక వచ్చింది. ప్రియదర్శన్-లిజిల కూతురు కల్యాణి ప్రియదర్శన్ కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో స్టార్ డాటర్ రాబోతోంది. ఆమె పేరు ఐశ్వర్య.

హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. స్వయంగా అర్జున్ కూతుర్ని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు. తన స్వీయ దర్శకత్వంలో ఐశ్వర్యను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు. అయితే ఐశ్వర్యకు సిల్వర్ స్క్ర్రీన్ ఎంట్రీ కొత్త కాదు. ఆమె ఇప్పటికే విశాల్ సరసన తమిళ్ లో ఓ సినిమా చేసింది. అటు కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో తన తొలి సినిమా చేస్తోంది.

2013లోనే కోలీవుడ్ లో హీరోయిన్ గా మారింది ఐశ్వర్య. కానీ విశాల్ తో చేసిన ధీరుడు సినిమా ఆమె కెరీర్ కు ప్లస్ కాలేదు. ఆ తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు. దీంతో గ్యాప్ తీసుకొని, కన్నడలో లక్ చెక్ చేసుకుంది. అక్కడ కూడా ఆమెకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తెలుగులో ట్రై చేస్తోంది. ఓ క్రేజీ హీరో సినిమాతో కూతుర్ని టాలీవుడ్ తెరకు పరిచయం చేయాలనేది అర్జున్ కోరిక. పైగా తన సొంత డైరక్షన్. చూడాలి.. ఈసారి ఐశ్వర్య కెరీర్ ఏ మలుపు తీసుకుంటుందో?