అవును.. మా ఆయనకు ఎఫైర్ ఉంది

ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్న చందు గురించి, ఆయన మరణం తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చందు భార్య శిల్ప, తన భర్తకు సంబంధించి చాలా వివరాల్ని బయటపెట్టారు. Advertisement…

ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్న చందు గురించి, ఆయన మరణం తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చందు భార్య శిల్ప, తన భర్తకు సంబంధించి చాలా వివరాల్ని బయటపెట్టారు.

“పవిత్ర జయరాం పరిచయమైన తర్వాత నా మొహం చూడడం మానేశాడు. వాళ్లిద్దరు ఫ్రెండ్స్ అని మాత్రమే అనుకున్నాను. కానీ ఎఫైర్ ఉందని ఆ తర్వాత తెలిసింది. మేం 11 ఏళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నాం. అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అలాంటిది నన్ను పట్టించుకోలేదు. పవిత్ర గురించే మాట్లాడేవాడు. నాకు 8 ఏళ్ల పాప, 4 ఏళ్ల బాబు ఉన్నారు. ఎఫైర్ పై చందును గట్టిగా అడిగాను. పవిత్ర ఇష్టమైతే ఆమెతోనే ఉండమని చెప్పాను. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు.”

తామిద్దరం చట్టపరంగా విడిపోలేదని, కానీ మాట్లాడుకొని దాదాపు నాలుగేళ్లు అవుతుందని చెప్పుకొచ్చారు శిల్ప. పవిత్ర మృతి చెందిన తర్వాత ఇంటికొచ్చాడని, కానీ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని తెలిపింది.

“మేం మాట్లాడుకొని దాదాపు 4 ఏళ్లయింది. పవిత్ర చనిపోయిన తర్వాత వచ్చాడు. జరిగిందేదో జరిగిపోయింది, పవిత్ర చనిపోయింది, ఇకనైనా మాతోనే ఉండమని చెప్పాను. పిల్లల కోసమైనా ఉండమని అడిగాను. నేను చావను, పిల్లల కోసం ఉంటానని మాటిచ్చాడు. చెప్పిన 24 గంటల్లోనే చనిపోయాడు.”

సూసైడ్ కు 24 గంటల ముందు జరిగింది ఇది…

పవిత్ర మృతి చెందినప్పట్నుంచి తీవ్రంగా మానసిక ఆందోళనకు గురయ్యాడు చందు. ఆమె లేని లోటును భరించలేకపోయాడు. ఆమె లేకపోయినా, ఉన్నట్టుగా భావించి ఇనస్టాగ్రామ్ లో పోస్టులు పెట్టేవాడు. రోజంతా తాగుతూ ఉండేవాడు. అతడు ఎక్కడ తాగినా, తను కనుక్కునేదాన్నని, బాగానే ఉన్నాడని తెలుసుకున్న తర్వాత నిద్రపోయేదాన్నని తెలిపారు శిల్ప.

ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందురోజు బాగా తాగి రోడ్డుపై పడిపోయాడు చందు. అతడ్ని స్నేహితులు, వాళ్ల ఫ్లాట్ కు తీసుకెళ్లారు. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి చెప్పాపెట్టకుండా బయటకెళ్లాడు. అయినప్పటికీ శిల్ప, తనకు తెలిసిన వాళ్ల ద్వారా అతడు ఎక్కడికెళ్లాడో కనుక్కున్నారు.

నేరుగా పవిత్ర జయరాం ఫ్లాట్ కు వెళ్లాడు చందు. ఆమెకు సంబంధించిన ఇన్సూరెన్స్ పనులు కొన్ని ఉన్నాయని, అవి పూర్తిచేయాలని అన్నాడట. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాదాపు 20 మంది ద్వారా కాల్స్ చేయించినా లిఫ్ట్ చేయలేదంట. అదే ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ తర్వాత కబురు అందింది.

చనిపోయే ముందు వాట్సాప్ చాట్..

సూసైడ్ చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన సహనటి కరాటే కల్యాణితో ఛాట్ చేశాడు చందు. ఆ స్క్రీన్ షాట్స్ ను కరాటే కల్యాణి విడుదల చేశారు. “నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడ్ని అయిపోతా, లేదా తాగుబోతుగా మారి ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెడతా.” అంటూ చివరి సందేశం పంపించాడు.