Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్య..సిద్దిఖీ…లతో వెంకీ భారీ సినిమా

ఆర్య..సిద్దిఖీ…లతో వెంకీ భారీ సినిమా

విక్రమ్ సినిమా స్ఫూర్తి అన్నట్లుగా వుంది విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా సైంధవ్ అనౌన్స్ మెంట్ పోస్టర్…గ్లింప్స్. దర్శకుడు కొలను శైలేష్ ఈసారి చాలా భారీ కథను తెరెకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. భారీ బడ్జెట్ కూడా అవసరం పడుతుందని తెలుస్తోంది. 

తమిళ నటుడు ఆర్య ఇదే సినిమాలో ఓ కీలకపాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది. అలాగే నవాజద్దీన్ సిద్దిఖీ ని కూడా ఓ కీలకపాత్రకు తీసుకుంటున్నారట. సంతోష్ నారాయణన్ ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్ గా అనౌన్స్ చేసారు.

అంటే మొత్తం మీద సినిమాకు భారీ గానే ఖర్చు చేయాలని నిర్మాత వెంకట్ బోయనపల్లి డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. వెంకటేష్ చాలా రోజులుగా సరైన కథ దొరక్క ఖాళీగా వున్నారు. ఎన్ని కథలు విన్నా నచ్చలేదు. అలాంటిది హిట్ 2 తరువాత శైలేష్ వెళ్లి ఇలా కథ చెప్పి, అలా ఓకె చేయించుకుని వచ్చాడు. పైగా పోస్టర్ డిజైన్ చేయించేసాడు. గ్లింప్స్ షూట్ చేయించి, సెట్ మీదకు వెళ్లిపోతున్నాడు.

చూస్తుంటే బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వున్నట్లుంది. ఎందుకంటే అలా లేకుండా వెంకీ అంత వేగంగా ఓకె చెప్పరు. బహుశా ఇటీవలి కాలంలో వెంకీ చేస్తున్న భారీ సినిమా ఇదే నేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?