ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోల హవా నడుస్తోంది. ఇటీవలి కాలంలో సీనియర్ హీరోల రెమ్యూనిరేషన్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఆ మాట కు వస్తే అందరు హీరోల రెమ్యూనిరేషన్లు పెరిగిపోయాయి.
గాడ్ ఫాదర్, వీరయ్య సినిమాలకు మెగాస్టార్ 50 కోట్ల వంతున రెమ్యూనిరేషన్ తీసుకున్నారని విశ్వసనీయవర్గాల బోగట్టా. మొన్నటి వరకు 18 కోట్ల వరకు పెంచుకుంటూ వచ్చారు రవితేజ తన రెమ్యూనిరేషన్ అని టాక్. ఇప్పుడు ఇరవై చేస్తున్నారని వినిపిస్తోంది.
బాలయ్య వీరసింహారెడ్డి సినిమాను ఎనిమిదికి ఓకె చేసి, అఖండ తరువాత 12 కోట్ల కింద మార్చారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమాకు 14 కోట్ల కు ఓకె చేసారు. విడుదల టైమ్ లో పెంచుతారేమో తెలియదు. కొత్త సినిమాలు మాత్రం 16 కోట్ల రేంజ్ లో తీసుకుంటారని టాలీవుడ్ జనాల అంచనా.
ఎఫ్ 3 సినిమాకు ఎనిమిది కోట్ల తీసుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు లేటెస్ట్ సినిమాకు 12 కోట్లు తీసుకుంటున్నారని వినిపిస్తోంది.
సీనియర్ హీరోల పరిస్థితి ఇలా వుంటే హీరో నాని 20 కోట్లు కోట్ చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 25 కోట్లు అడుగుతున్నారని భోగట్టా. కార్తికేయ 2 తరువాత నిఖిల్ 7 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వినిపిస్తోంది నాగశౌర్య 4 కోట్లు తీసుకుంటున్నారట. సరిగ్గా లైనప్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ కూడా 10 కోట్లు అడుగుతున్నారట.
మొత్తం మీద నాన్ థియేటర్ హక్కులు, ఓవర్ సీస్ హక్కులు పెరగడం, థియేటర్ల రెవెన్యూ సినిమా బాగుంటే బాగా రావడం వంటివి కలిసి హీరోల రెమ్యూనిరేషన్లు పెంచేసాయి.