సినిమా ప్రేక్షకుల మీద ఈ వారం చిన్న సినిమాల మూకుమ్మడి దాడి జరుగుతోంది. అసలు ఇక డేట్‌లే లేనట్లు అరడజను సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. ఆ పై మిగిలిన డేట్ లు అన్నీ దాదాపు ఖాళీగా మిగలబోతున్నాయి. మరి ఈ ఆరో తేదీ స్పెషాలిటీ? ఫస్ట్ వీక్ జనాల దగ్గర కాస్త డబ్బులు వుంటాయనేమో? నిజానికి ఈ ఆరో తేదీ దాటితే, మళ్లీ వీక్ వరకు దసరా వీక్ వరకు సినిమా లేదు. 13 వ తేదీని అలావదిలేసారు. అంటే ఈ చిన్న సినిమాలు వేటికీ వన్ వీక్ రన్ సరిపోదనే ఆలోచనతో నేమో? దసరా వారం తరువాత మళ్లీ డిసెంబర్ వరకు దాదాపు అన్ని వారాలు పెద్దగా సినిమాలు ఏమీ లేవు.. ఒకటీ.. అరా తప్ప. ఇదో చిత్రమైన పరిస్థితి
ఈ వారం, మంత్ ఆఫ్ మధు, రూల్స్ రంజన్, మామా మశ్చీంద్ర, 800, మ్యాడ్, చిన్నా సినిమాలు విడుదలవుతున్నాయి. వీటన్నింటికి దేని స్పెషాలిటీ దానికి వుంది.
మంత్ ఆఫ్ మధు సినిమా ఓ కల్ట్ క్లాసిక్ మాదిరిగా కనిపిస్తోంది. కలర్స్ స్వాతి ఓ భిన్నమైన పాత్రలో కనిపిస్తోంది. అదే సమయంలో మరో హీరోయిన్ పాత్ర కూడా వుంది సినిమాలో. నవీన్ చంద్ర పాత్ర కూడా రెండు మూడు షేడ్స్ లో కనిపిస్తోంది.
రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడా పాట బ్లాక్ బస్టర్ హిట్. నేహా శెట్టి ఈ సినిమాకు పెద్ద ప్లస్. కిరణ్ అబ్బవరం కూడా ఫుల్ కామెడీ క్యారెక్టర్ చేసాడు. ఇవన్నీ కలిసి ఈ సినిమా మీద కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి.
మామా మశ్చీంద్ర…వాస్తవం మాట్లాడుకోవాలంటే అన్ని సినిమాల్లో చాలా తక్కువ బజ్ వున్న సినిమా ఇది. ఉన్నట్లుండి ఊడిపడింది. కంటెంట్ ఏమిటి అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ట్రయిలర్ వచ్చినా పెద్దగా బజ్ రాలేదు. దర్శకుడు హర్ష వర్దన్ మీద కాస్త నమ్మకం వుంది. సినిమా విడుదల తరువాత కానీ దీని మీద ఓ అంచనా అంటూ రాదు.
800 సినిమా క్రికెటర్ ముత్తయ్య బయోపిక్. అన్ని రకాల కంటెంట్ ఇందులో వుందంటున్నారు మేకర్లు. కానీ బయోపిక్.. అందులోనూ క్రికెటర్ ది అంటే థియేటర్ కు జనాలు ఏ మేరకు వస్తారో చూడాలి. ముత్తయ్య అంటే యూత్ లో ఆసక్తి వుంది. ఆ ఆసక్తే టికెట్ లు తెగేలా చేయాల్సి వుంటుంది.
మ్యాడ్ సినిమా కు తొలి అట్రాక్షన్ ఏమిటంటే, ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా నటించడం. ఇదే సినిమాలో జాతిరత్నాలు అనుదీప్ ఓ పాత్ర చేయడం. ఈ సినిమా దర్శకుడు అనుదీప్ శిష్యుడు. మంచి ఫన్ టైమింగ్ వున్నవాడు. టీజర్ యూత్ ఫుల్ గా వుండి జనాలను ఆకట్టుకుంది, ట్రయిలర్ కూడా బాగానే వుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. సరైన యూత్ ఫిల్మ్ పడితే మౌత్ టాక్ తో ముందుకు వెళ్తుంది అని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. ఈ సినిమాకు అదే రక్ష.
చిన్నా సినిమా తమిళంలో మంచి ప్రశంసలు అందుకుంది. నటుడు సిద్దార్ధనే ఈ సినిమాకు నిర్మాత. కానీ అంత ప్రాపర్ రిలీజ్ ఈ సినిమాకు దొరకడం లేదు తెలుగులో. ఎందుకంటే ఇన్ని సినిమాల మధ్య స్క్రీన్ లు దొరకడమే కష్టం.
మొత్తం మీద ఓపెనింగ్ ఏ సినిమా కూ పూర్తిగా రాదు. టాక్ వచ్చిన తరువాతనే ఒకటి రెండు సినిమాలు నిల్చునే అవకాశం వుంది. మిగిలినవి కష్టమే. ఇదే కనుక కాస్త వారం వారు వేసుకుని వుంటే పరిస్థితి వేరుగా వుండేదేమో?