జాతిరత్నాలు.. జూనియర్స్ ?

జాతిరత్నాలు సినిమా చూసి ప్రభావితం అయ్యారో, లేదా ఆ సినిమాకు పని చేసిన అనుభవమో, మొత్తం మీద అదే సినిమాలో మాదిరిగా మ్యాడ్ సినిమాలో కూడా మూడు కీలకపాత్రలు, సిట్యువేషన్ తో సంబంధం లేకుండా…

జాతిరత్నాలు సినిమా చూసి ప్రభావితం అయ్యారో, లేదా ఆ సినిమాకు పని చేసిన అనుభవమో, మొత్తం మీద అదే సినిమాలో మాదిరిగా మ్యాడ్ సినిమాలో కూడా మూడు కీలకపాత్రలు, సిట్యువేషన్ తో సంబంధం లేకుండా వాటి డైలాగు కామెడీ. పంచ్ కి పంచ్ అనే కాన్సెప్ట్ తో జాతిరత్నాలు సినిమా తయారయింది. ఎక్కువగా డైలాగు కామెడీనే.  అదే ఫార్మాట్ లో తయారవుతోంది బట్ బ్యాక్ డ్రాప్ వేరు అనిపిస్తోంది మ్యాడ్ సినిమా ట్రయిలర్ చూస్తుంటే.

విలేజ్ లో అల్లరి చిల్లరి గ్యాంగ్. ఇక్కడ కాలేజీలో. సేమ్ టు సేమ్ పంచ్ టు పంచ్ కాన్సెప్ట్. కానీ ఎటొచ్చీ ట్రయిలర్ లో పడిన డైలాగులు అన్నీ పేలలేదు. స్టార్టింగ్ లో వేసిన ఎసి లో నీళ్లుపోయలేదు అనే డైలాగు. ఇలాగే మరి కొన్ని డైలాగులు. ఇక్కడ కారణం డైలాగుల్లో బలం లేక మాత్రమే కాకపోవచ్చు. 

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి లాంటి వాళ్లకు ఓ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ వుంటుంది. అది ప్లస్ అయింది. ఆ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ వాళ్లకి వాళ్ల మొదటి సినిమాల నుంచి ప్లస్ అవుతూ వచ్చింది. ఇక్కడ ఈ కొత్త కుర్రాళ్లలో అలాంటి మ్యాజిక్ వుంటుందా అన్నది మాత్రం ట్రయిలర్ చూసి మాత్రం నిర్ధారణ చేయగలిగేలా లేదు. సినిమా వచ్చిన తరువాత మాత్రమే తెలిసేలా వుంది.

స్టోరీతో సంబంధం లేకుండా మ్యాడ్ డైలాగ్ కామెడీ సినిమా అని మేకర్స్ ముందుగానే చెప్పారు కాబట్టి ఇక మిగిలిన విషయాల గురించి మాట్లాడడానికి లేదు. టీజర్ లో ఓ డబుల్ మీనింగ్ బూతు డైలాగు వేసినట్లే, ట్రయిలర్ లో కూడా 'బ్లో జాబ్' అనే డబుల్ మీనింగ్ డైలాగు పడేసి ఎండ్ చేసారు. ఇలాంటివి సినిమాలో పుష్కలంగా వుంటే మాత్రం జాతిరత్నాలు సినిమాతో అస్సలు పోల్చడానికి లేదు. అని నాగ్ అశ్విన్, స్వప్న సినిమా సూపర్ విజన్ లో వచ్చిన క్లీన్ కామెడీ. 

సినిమా చూసాక మ్యాడ్ డబుల్ మ్యాడ్ గా వుంటుందా.. జూనియర్ జాతిరత్నాలు అవుతుందా అన్నది క్లారిటీ వస్తుంది. అంత వరకు వెయిట్ అండ్ సీ.