Advertisement

Advertisement


Home > Movies - Movie News

అసలు దసరా సంగతి ఏమిటి?

అసలు దసరా సంగతి ఏమిటి?

నిన్నటికి నిన్న దసరా సినిమా మీడియా మీట్ జ‌రిగింది. దసరా సినిమాకు 70 కోట్లకు పైగా ఖర్చయిందట నిజ‌మేనా అని హీరో నానికి ప్రశ్న ఎదురయింది. దానికి చెప్పాల్సిన జ‌వాబు..అవును..లేదా కాదు..లేదా ఎందుకు అంత అయింది అన్నది. కానీ నాని సమాధానం చెప్పకుండా, అవునా..ఎవరు మీరు చెప్పారా అంటూ నిర్మాత సుధాకర్ ను స్టేజ్ మీదే అడిగేసారు. దానికి నిర్మాత ఏమంటారు పాపం? సినిమా చూడండి..దాన్ని బట్టి మీకే తెలుస్తుంది అన్నారు. అంటే ఒక విధంగా నిజ‌మే అని కదా?

అసలు దసరా సినిమా బడ్జెట్ సంగతులు తెలియాలంటే కాస్త వెనక్కు వెళ్లాలి. ఈ సినిమా ప్రపోజ‌ల్ నాని దగ్గరకు వచ్చినపుడు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎలా తీస్తాడా? అన్న అనుమానం పడ్డారు. దాంతో కొంత టెస్ట్ షూట్ చేసారు. దాని కోసం ఎంతో కొంత ఖర్చు చేసారు. మరి ఆ ఖర్చు బడ్జెట్ లోకే కదా వస్తుంది. సినిమా స్టార్ట్ అయిన జ‌స్ట్ కొన్ని రోజులకే బడ్జెట్ భారీగా అయ్యేలా వుందని అర్థం అయింది. దాంతో కొన్ని రోజులు షూట్ ఆపారు. దీంతో శ్యామ్ సింగ రాయ్ మాదిరిగా బడ్జెట్ లెక్కల కారణంగా సినిమా చేతులు మారుతోందన్న అనుమానాలు వినిపించాయి. ఆ మేరకు వార్తలు కనిపించాయి.

ఇవన్నీ కొంత వరకు నిజ‌మే కూడా. అయినా ఓ సిన్మా స్టార్ట్ చేసి వదిలితే నిర్మాత గుడ్ విల్ కు ప్రమాదం. అందుకే నిర్మాత సుధాకర్ ముందుకు వెళ్లారు. సినిమాకు అచ్చంగా 67 కోట్ల మేరకు బడ్జెట్ అయిందని తెలుస్తోంది. దీనికి వడ్డీలు కలపాలి. పాన్ ఇండియా ప్రమోషన్ కోసం చేస్తున్న లక్షల ఖర్చు కలపాలి. లోకల్ పబ్లిసిటీ ఖర్చు కలపాలి. అన్నింటికి మించి హిందీ విడుదలకు అవసరమైన థియేటర్లు, క్యూబ్ ఖర్చులు కూడా నిర్మాతవే. ఇవన్నీ కలిసి సినిమా ఖర్చు దగ్గర దగ్గర 80 కోట్ల మేరకు చేరుకుందని తెలుస్తోంది.

నిజానికి నాని జెర్సీ కూడా లాభం రాని సినిమానే. కొన్ని ఏరియాలకు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు వెనక్కు ఇచ్చారు. అలాగే ముందుగా అనుకున్న భాగస్వామ్యం ప్రకారం నాని రెమ్యూనిరేషన్ మేరకు లాభాల్లో వాటా రాకపోవడంతో, నిర్మాతే అది కూడా భరించారు. శ్యామ్ సింగ రాయ్ కూడా కాస్ట్ ఫెయిల్యూర్ నే.

దసరా సినిమా ఇప్పుడు కనీసం నాలుగు కోట్ల డెఫిసట్ తో విడులవుతోంది. అయితే సినిమాకు మాంచి బజ్ వ‌చ్చింది కనుక హిందీ వెర్షన్ ఏమైనా గట్టిగా వసూళ్లు సాగిస్తే నిర్మాత బయటపడిపోతారు. తెలుగు వెర్షన్ కు ఓవర్ ఫ్లోస్ అన్నవి నిర్మాతకు రావు. ఎందుకంటే ముందుగానే అవుట్ రేట్ గా అమ్మేసారు. హిందీ వెర్షన్ బాగా వసూళ్లు సాగిస్తేనే దసరా నిర్మాత సుధాకర్ హ్యాపీ అయ్యేది.

ఇవీ దసరా బడ్జెట్ వివరాలు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?