అసలు టైటల్ భగత్ సింగ్ నా?

భవదీయుడు భగత్ సింగ్…ఉస్తాద్ భగత్ సింగ్..ఈ రెండు టైటిళ్లు పవన్ కోసమే. దర్శకుడు హరీష్ శంకర్ పెట్టుకున్నవే. భవదీయడు తీసి ఉస్తాద్ ఎందుకు పెట్టారో హరీష్ కే తెలియాలి. కథ మారినంత మాత్రాన భగత్…

భవదీయుడు భగత్ సింగ్…ఉస్తాద్ భగత్ సింగ్..ఈ రెండు టైటిళ్లు పవన్ కోసమే. దర్శకుడు హరీష్ శంకర్ పెట్టుకున్నవే. భవదీయడు తీసి ఉస్తాద్ ఎందుకు పెట్టారో హరీష్ కే తెలియాలి. కథ మారినంత మాత్రాన భగత్ సింగ్ టైటిల్ సూట్ అవుతుంది అనుకుంటే భవదీయుడు కూడా సూట్ అవుతుంది కదా? మరి ఎందుకు మార్చినట్లు?

ఇదిలా వుంటే అసలు టైటిల్ భగత్ సింగ్ యే నని, గబ్బర్ సింగ్ తరువాత భగత్ సింగ్ అన్నది ఈక్వల్ గా పవర్ పుల్ గా వుంటుదని అనుకుని ఫిక్స్ అయ్యారు. కానీ భగత్ సింగ్ అన్న టైటిల్ ఓ కమర్షియల్ సినిమాకు వాడితే కొందరయినా అభ్యంతరం చెప్పే అవకాశం వుంది. 

వాల్మీకి పేరు వాడితేనే గడబిడ జరిగింది. చివరకు మార్చాల్సి వచ్చింది. భగత్ సింగ్ లాంటి దేశభక్తుడి పేరు అదే విధంగా వాడితే ఇబ్బంది రావచ్చు. అందుకే జస్ట్ నామ్ కే వాస్తే ముందు ఓ ప్రీఫిక్స్ సెట్ చేసారని అనుకోవాల్సి వస్తోంది.

టైటిల్ పెద్దగా భగత్ సింగ్ అనే అనే కనిపిస్తుంది. ఉస్తాద్ అయినా, భవదీయుడు అయినా పైన చిన్న అక్షరాలే. ఇదిలా వుంటే ఉస్తాద్ అన్నది సినిమా హీరో రామ్ కు ఫ్యాన్స్ పెట్టుకుని బిరుదు. పవర్ స్టార్..మెగాస్టార్ మాదిరిగా. ఇప్పుడు దాన్ని పవన్ కు వాడేసారు. దీని మీద రామ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అదీ కాక పెద్ద హీరో బిరుదుతో చిన్న హీరో సినిమా చేస్తే అది ఫాంటసీ లేదా ఫ్యాజన్ అనుకోవాలి. మిడ్ రేంజ్ హీరో టైటిల్ ను పెద్ద హీరో తీసుకోవడం చిన్నతనం కాదా? అన్న ప్రశ్నలు ఫ్యాన్స్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి.