బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను మరిచిపోకనే…మరాఠీ నటుడు అశుతోష్ భక్రే (32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్ర పరిశ్రమలో అశుతోష్ మృతి తీవ్ర కలకలం రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలోని నాందెడ్‌లో తన ఇంట్లో బుధవారం ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఒక వ్యక్తి తమ ప్రాణాలను తీసుకోడానికి గల కారణాలను ఆ వీడియోలో విశ్లేషించడం గమనార్హం. కొన్ని రోజులుగా అశుతోష్ భక్రే తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. అశుతోష్ భకార్, ఇచార్ తార్లా పక్కా తదితర చిత్రాల్లో నటించాడు.
ప్రముఖ మరాఠీ టెలివిజన్ నటి అయిన మయూరి దేశ్‌ముఖ్‌ను అశుతోష్ భక్రే 2016లో వివాహం చేసుకున్నాడు. పలు మరాఠా సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందారు. భార్యాభర్తలిద్దరూ గ్లామర్ ఫీల్డ్‌లోనే తమ ఉనికి చాటుకుంటున్నారు.
2013 చిత్రం భకార్‌తో అశుతోష్ భక్రేకు మంచి గుర్తింపు లభించింది. దీంతో ఆయనకు చెప్పుకోతగ్గ అభిమానులున్నారు. అతను ఇచార్ తార్లా పక్కాలో కూడా నటించాడు. కాగా ప్రముఖ టెలివిజన్ షో ‘కులాటా కాలి కులేనా’తో అశుతోష్ భార్య మయూరి దేశ్‌ముఖ్ బాగా ప్రాచుర్యం పొందారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మయూరి స్పందన చర్చనీయాంశంగా మారింది.
అప్పట్లో “ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో తెలియకుండా అతని గురించి మాట్లాడటం తప్పు” అని సుశాంత్‌కు మద్దతుగా మయూరి ఒక లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తన భర్త ఆత్మహత్యకైనా కనీసం మయూరికి కారణాలు తెలుసో? లేదో మరి?