Advertisement

Advertisement


Home > Movies - Movie News

రీమేక్ అని చెప్పి తప్పుచేశాడా?

రీమేక్ అని చెప్పి తప్పుచేశాడా?

త్వరలోనే అసురన్ సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు వెంకటేశ్. ఈ మూవీకి దర్శకుడ్ని ఎంపిక చేసే ప్రాసెస్ ప్రారంభించారు.

ఇండస్ట్రీలో పలువురు దర్శకులకు సినిమా చూపించారు కూడా. కుదిరితే క్రిష్, కుదరకపోతే హను రాఘవపూడికి ఈ రీమేక్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటూ ఫీలర్లు కూడా వస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం ఓవైపు ఇలా సాగుతుంటే.. మరోవైపు ఈ సినిమాకు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది.

అసురన్ రీమేక్ అని చెప్పడంతో తెలుగు ప్రేక్షకులంతా ఇప్పుడు ఈ సినిమాను చూడడం స్టార్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా అందుబాటులోకి రావడంతో.. తమిళ్ లో ఉన్నప్పటికీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్  ఉన్నప్పటికీ, అంతా ఈ సినిమాను చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎంత మంది తమిళ ప్రేక్షకులు చూస్తున్నారో, అంతే సంఖ్యలో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా చూస్తున్నారు.

దీని వల్ల అసురన్ రీమేక్ కు రెండు సమస్యలు. ఒకటి సినిమా కథ, కథనం, క్లైమాక్స్ ఏంటనేది రిలీజ్ కు ముందే చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఇక రెండోది కంపారిజన్. కేవలం వెంకీ-ధనుష్ నటన మధ్య పోలికలే కాకుండా.. ప్రేక్షకుల్లో పెరిగిన పరిజ్ఞానం కారణంగా కెమెరా, డైరక్షన్ లాంటి విభాగాల్లో కూడా పోలికలు ఎంచడం ఎక్కువైపోతుంది.

ఈ రీమేక్ ప్రాజెక్ట్ నుంచి చాలామంది దర్శకులు తప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణం. తమిళ్ లో అసురన్ సినిమా క్లాసిక్ అనిపించుకుంది.

అమెజాన్ ప్రైమ్ లో సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకు కూడా అందులో ఎమోషన్ కనెక్ట్ అయింది. అలాంటి రీమేక్ ను ఆత్మ చెడిపోకుండా తెలుగులో తీయడం కత్తిమీద సామే. మరి ఈ రీమేక్ ను డైరక్ట్ చేయడానికి ఎవరు ముందుకొస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?