రాజమౌళితో పెళ్లికి సంబంధించి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు రమా రాజమౌళి. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. పెళ్లి చేసుకుందామని ముందుగా రాజమౌళి ప్రపోజ్ చేశారట. దానికి ఆమె ‘పిచ్చి పట్టిందా’ అంటూ సమాధానం ఇచ్చారంట.
“రాజమౌళి ప్రపోజ్ చేసే టైమ్ కు నేను సిద్ధంగా లేను. ప్రపోజ్ చేయడం కూడా ఏమంత పెద్ద రొమాంటిక్ గా జరగలేదు. ఇద్దరం క్యాజువల్ గా మాట్లాడుకున్నాం. తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ్నుంచి వెళ్లిపో అన్నాను. ఎందుకంటే నేను అప్పటికే విడాకులు తీసుకున్నాను, కొడుకు (కార్తికేయ) కూడా ఉన్నాడు. అందుకే రాజమౌళి ప్రపోజ్ చేయడంలో అర్థం లేదని నాకు అప్పుడు అనిపించింది.”
రాజమౌళిని తొలిసారిగా తన సోదరి పెళ్లిలో చూశారంట రమా. అప్పుడు కూడా అతడేం ప్రత్యేకంగా కనిపించలేదని, నలుగురిలో ఒక్కడిగా మాత్రమే ఉన్నాడని అన్నారు. తమది రొమాంటిక్ స్టోరీ కాదంటున్నారు రమా. ఎందుకుంటే, రిలేషన్ షిప్ లోకి వచ్చేసరికే తామిద్దరం చాలా మెచ్యూర్డ్ అంటున్నారు.
“అన్ని విషయాల్లానే పెళ్లి విషయంలో కూడా రాజమౌళి చాలా పట్టుదలతో ఉన్నాడు. నేను అంగీకరించకపోయినా, ఏడాది పాటు ఎదురుచూశాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్నాం.”
రాజమౌళిపై రిలీజ్ చేసిన ఓ డాక్యుమెంటరీలో ఈ విషయాల్ని బయటపెట్టారు రమా రాజమౌళి. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొని ఈ ఏడాదికి 23 ఏళ్లు అవుతోంది.
I appreciate Rajamoulis advanced and matured ideology besides his exceptional directing capabilities
మా-డా-రె-డ్డి is aసై- కో అంటున్న bra’ రతి !!
శ-వా-లను చూస్తేసై-కో లాగా మారుతాడు అంటున్న సొంత పె-ళ్ళాం !!
Call boy works 8341510897
“అతడేం ప్రత్యేకంగా కనిపించలేదని, నలుగురిలో ఒక్కడిగా మాత్రమే ఉన్నాడని…”
who are other three? ‘Mahrshi’ Raghava, ‘Premiste’ Bharat and ‘Seshu’ Rajasekhar?
cinima chusevallu kudaa pichi gaane chesi hit chestaru – that is Rajamouli