ఆ రెండు సినిమాలకు అదే సమస్య

రెండు సినిమాలకు ఎక్కువ, రెండు సినిమాలకు తక్కువ లెక్కన ఇవ్వాల్సి వుంటుంది.

డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు రెండూ పోటా పోటీగా అగస్ట్ 15న విడుదలవుతున్నాయి. వీటితో పాటు విక్రమ్ తంగలాన్, చిన్న సినిమా ఆయ్, మరో రెండు మూడు హిందీ సినిమాలు విడుదలవుతున్నాయి. నైఙాంలోని సింగిల్ స్క్రీన్ లతో సమస్య లేదు. రెండు థియేటర్లు వుంటే చెరొకటి దొరుకుతుంది. కానీ మల్టీ ప్లెక్స్ లతో సమస్య అవుతుంది. అన్ని సినిమాలకు స్కీన్ లు అకామిడేట్ చేయాలి.

హిందీ సినిమాలకు ఐనాక్స్, పీవీఆర్ లు రెండూ కచ్చితంగా షోలు ఇవ్వాలి. కనీసం అయిదారు షోలు వాటికి పోతాయి. మిగిలిన షో లు తెలుగు సినిమాలు నాలుగింటికీ సర్దాలి. రెండు సినిమాలకు ఎక్కువ, రెండు సినిమాలకు తక్కువ లెక్కన ఇవ్వాల్సి వుంటుంది. ఇదంతా విడుదల నాటి వరకు. విడుదలైన తరువాత ఏ సినిమా బాగుంటే అదే స్క్రీన్ లు అటోమెటిక్ గా లాగేసుకుంటుంది.

సరే, విడుదలైన తరువాత బాగున్న సినిమాలకు స్క్రీన్ లు వస్తాయి కదా. ఇంకేంటీ సమస్య అనొచ్చు. అక్కడే వుంది. ధమాకా సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. నైజాంలో వసూలు చేసింది 13 కోట్లకు కాస్త అటు ఇటుగా. పైగా ధమాకా సినిమాకు రెండు మూడు వారాల పాటు పెద్దగా అపోజిషన్ లేదు. కానీ ఇప్పుడు సోలో విడుదల కాదు. అపోజిషన్ వుంది. పైగా రెండు వారాల్లో నాని సినిమా సరిపోదా శనివారం వస్తోంది. దానికి మంచి బజ్ వుంది.

ఈ సమస్య కేవలం బచ్చన్ కు మాత్రమే కాదు. డబుల్ ఇస్మార్ట్ కు కూడా. డబుల్ ఇస్మార్ట్ నైజాం వాల్యూ ఎలా లేదన్నా 15 కోట్ల వరకు వుంటుంది. తక్కువ స్క్రీన్ లతో, గట్టి పోటీ నడుమ, తక్కువ స్పాన్ లో అంత వసూళ్లు సాగించాలి.

ఇదే కనుక ఈ రెండు సినిమాలు విడివిడిగా పోటీ లేకుండా వచ్చి వుంటే, మల్టీ ప్లెక్స్ స్క్రీన్ లు చాలా ఎక్కువ దొరికివుండేవిు. దాని వల్ల మంచి ఓపెనింగ్ పడే అవకాశం వుండేది. అప్పుడు బ్రేక్ ఈవెన్ చాలా సులువు అవుతుంది. ఇప్పుడు కాస్త టఫ్ సిట్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు సినిమాలు కూడా.

3 Replies to “ఆ రెండు సినిమాలకు అదే సమస్య”

Comments are closed.