బ్రెయిన్ చుట్టూ తిరిగే కథ

డబుల్ ఇస్మార్ట్ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ లో బ్రెయిన్ లో చిప్ పెట్టడం అన్నది పాయింట్. డబుల్ ఇస్మార్ట్ లో ఏకంగా బ్రెయిన్ నే మార్చేయడం అన్నది పాయింట్. పైగా హీరో…

డబుల్ ఇస్మార్ట్ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ లో బ్రెయిన్ లో చిప్ పెట్టడం అన్నది పాయింట్. డబుల్ ఇస్మార్ట్ లో ఏకంగా బ్రెయిన్ నే మార్చేయడం అన్నది పాయింట్. పైగా హీరో తల వెనుక యు ఎస్ బి పోర్ట్ వుంటుంది. అదెలా పాజిబుల్ అన్నది సినిమా చూస్తే తప్ప తెలియదు. అక్కడితో సరిపెట్టకుండా విలన్ ఈ సారి తన బ్రెయిన్ ను హీరో బ్రెయిన్ లోకి మార్చేసేపని పెట్టుకుంటాడు. అప్పటి నుంచి ఏమయింది అన్నది అసలు సిసలు సినిమా కావచ్చు.

పూరికి తల్లి సెంటిమెంట్ సినిమాల్లో పెట్టడం అన్నది గతంలో కూడా వుంది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ లో కూడా మదర్ సెంటిమెంట్ యాడ్ చేసినట్లు కనిపిస్తోంది. కమెడియన్ ఆలీ కూడా ఓ సెంటిమెంట్ పూరిజ‌గన్నాధ్ కు. అందుకే ఆలీ కోసం ఓ ట్రాక్ ను ప్రత్యేకంగా డిజైన్ చేసి యాడ్ చేసినట్లు కనిపిస్తోంది. ట్రయిలర్ లో అయితే అదేమీ పెద్ద అట్రాక్షన్ అయితే కాదు. సినిమాలో ఎలా వుంటుందో చూడాలి.

పూరి మార్క్ డైలాగులు ఒకటి రెండు, పూరి మార్క్ రొమాంటిక్ సీన్లు కొన్ని ట్రయిలర్ లో పడ్డాయి. టోటల్ గా ఓ మాస్ ప్యాకేజ్ సినిమా ఇది అని చెప్పడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ట్రయిలర్ లో పడిన మాస్ హోరులో మణిశర్మ వర్క్ వినిపించలేదు. సినిమాలోనే వినిపిస్తుంది. ఈ నెల 15న విడుదలయ్యే ఈ సినిమాకు కావాల్సినంత బజ్ ను అయితే ఈ ట్రయిలర్ తీసుకువస్తుంది. అది చాలు మేకర్లకు.

5 Replies to “బ్రెయిన్ చుట్టూ తిరిగే కథ”

Comments are closed.