సాధారణంగా ఓ సినిమాపై రిలీజ్ కు ముందు కొన్ని అంచనాలుంటాయి. నిన్న రిలీజైన సినిమాలపై కూడా అలాంటివే కొన్ని అంచనాలుండేవి. ఉదాహరణకు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమానే తీసుకుంటే, అందులో లవ్, రొమాన్స్ లాంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని ప్రేక్షకులు ఆశించారు. ఇక ఈ సినిమాకు పోటీగా వచ్చిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాలో కామెడీ దండిగా ఉంటుందని ఆశించారు.
కానీ నిన్న రిలీజైన ఈ రెండు సినిమాల్లో ప్రేక్షకుల అంచనాలు తారుమారయ్యాయి. లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాలో ఫుల్లుగా కామెడీ ఉంటుందని ఆశిస్తే, అది కాస్తా ఆశాభంగం కలిగించింది. ఆ కామెడీ అల్లు శిరీష్ సినిమాలో కనిపించేసరికి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయింది.
అవును.. ఊర్వశివో రాక్షసివో సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంది. కేవలం రొమాన్స్ తోనే సరిపెట్టకుండా మంచి కామెడీ అందించింది ఈ సినిమా. మరీ ముఖ్యంగా వింటేజ్ సునీల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అటు వెన్నెల కిషోర్ కామెడీ కూడా అద్భుతంగా పండడంతో పాటు.. ఇతర పాత్రలన్నీ ఏదో ఒక రూపంలో నవ్వించడంతో అల్లు శిరీస్ సినిమా సక్సెస్ ఫుల్ గా పాస్ అయిపోయింది.
సరిగ్గా ఇదే కామెడీ లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ లో మిస్సవ్వడంతో అది మిస్-ఫైర్ అయింది. ఓ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయడం ఒకెత్తయితే, ఆ అంచనాల్ని అందుకోవలం మరో ఎత్తు అనే విషయాన్ని ఈ రెండు సినిమాలు ప్రూవ్ చేశాయి.