ఆగస్టులో ఎవరి బిపి పెరిగింది

''ఎవరైనా బిపి పెరిగితే మందులు వేసుకుంటారు కానీ పరుల ఆస్తులు ధ్వంసం చేస్తారా?'' Advertisement ఇది సీనియర్ జర్నలిస్ట్ అని ప్రకటించుకునే వారికి ఈవారం వచ్చిన పెద్ద అనుమానం. ఆంధ్ర సిఎమ్ జగన్ అన్న…

''ఎవరైనా బిపి పెరిగితే మందులు వేసుకుంటారు కానీ పరుల ఆస్తులు ధ్వంసం చేస్తారా?''

ఇది సీనియర్ జర్నలిస్ట్ అని ప్రకటించుకునే వారికి ఈవారం వచ్చిన పెద్ద అనుమానం. ఆంధ్ర సిఎమ్ జగన్ అన్న మాటలు పట్టుకుని, కేవలం రెండు, మూడు చోట్ల అది కూడా పొలిటికల్ గా జరిగిన దాడులను పట్టుకుని ఆంధ్ర అంతా అరాచకం అయిపోతోంది, ఫ్యాక్షన్ దాడులు జరుగుతున్నాయనే కలరింగ్ ఇవ్వడానికి తన వంతు అక్షర యజ్ఞం సాగించడంలో భాగంగా కోట్ చేసిన లైన్ అది.

సరే కాస్సేపు అదే కరెక్ట్ లాజిక్ అని అనుకుందాం.

మరి ఆగస్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ఎన్టీఆర్ ను గద్దె దింపినపుడు ఆంధ్ర అంతా ఏం జరిగింది? నాదెండ్ల వైపు ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరగలేదా? ఆ దాడులు అన్నీ ఎవరు చేసారు? ఎమ్మెల్యేలు గంటెల సుమన, గ్రంధి మాధవి లాంటి వాళ్ల అవతారాలను వేసుకున్న జనాలు రోడ్ల మీద వికృత ప్రదర్శనలు చేసారు ఆ రోజుల్లో. 

నాదెండ్ల వైపు వున్న ఎమ్మెల్యేలు తమ ఇళ్లకు తాళాలు వేసి ఎక్కడో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ ఇళ్లపై దాడులు జరిగాయి. పోలీసు పహారా పెట్టాల్సి వచ్చింది. ఇదంతా ఎవరి బిపి పెరగడం వల్ల జరిగింది? ఎవరు వార్తలు వండి వార్చి జనాలను రెచ్చగొట్టింది ఆ రోజుల్లో. 

మరి మళ్లీ మరోసారి అదే ఎన్టీఆర్ ను గద్దె దింపినపపుడు చంద్రబాబు వైపు వున్న ఏ ఒక్క ఎమ్మెల్యే ఇంటి మీద కూడా దాడులు జరగలేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగలేదు. ఎక్కడా పోలీసు కాపలా లేదు? ఎందువల్ల? ఒక్క అక్షరం కూడా జనాలను రెచ్చగొట్టేలా వండి వార్చలేదు ఎందుకని?

సరే, ఈ వ్యవహారం అలా వుంచుదాం.

కోస్తా జిల్లాల్లో బలమైన వర్గానికి చెందిన నాయకుడిని హత్య చేసారు. ఎవరు చేసారో? ఎవరు చేయించారో జనం కథలు కథలుగా చెప్పుకున్నారు. చెప్పుకుంటూనే వున్నారు. ఆ వెంటనే అనేక చోట్ల పలు ఆస్తుల మీద దాడులు జరిగాయి.

కొన్ని చోట్ల పత్రికల ప్రింటింగ్ ఆగిపోయింది. వాటికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఓ వర్గం ఆగ్రహాన్ని అర్థం చేసుకుని ఏమంటే ఏమొస్తో అని మౌనంగా వుండిపోయారు..

ఎవరి బిపి పెరిగితే జరిగింది ఇదంతా?

రాజీవ్ గాంధీ హత్య తరువాత జరిగిన వ్యవహారాలు ఏమిటి? కత్తి మహేష్, పోసాని కృష్ణ మురళి తదితరులపై ఫ్యాన్స్ చేసిన దాడుల మాటేమిటి? ఇవన్నీ బీపీ లు పెరిగి చేసినవి కాదా?

ఆ దాడులు అన్నింటికీ రాజకీయ కారణాలు వుంటాయా? ఈ దాడులు అన్నీ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజ్యంగా మార్చడానికి అంటామా? మన కలం, మన పత్రిక..మన రాతలు అనుకుంటే ఎవరూ ఏమీ అనేది లేదు..చేసేది లేదు. కానీ ఒకరు చేస్తే ఒప్పు..మరొకరు చేస్తే తప్పు అంటే అనే తప్పు అనిపిస్తుంది.