ప్రతి ఏటా ఆగస్ట్ షాక్ తప్పదా..?

హిస్టరీ చూసుకుంటే, కరోనా తర్వాత ప్రతి ఏటా ఆగస్ట్ లో టాలీవుడ్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కోసారి డబుల్ షాకులు కూడా ఉన్నాయి.

హిస్టరీ చూసుకుంటే, కరోనా తర్వాత ప్రతి ఏటా ఆగస్ట్ లో టాలీవుడ్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కోసారి డబుల్ షాకులు కూడా ఉన్నాయి.

2022 ఆగస్ట్ లో లైగర్ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు, దాన్నుంచి ఇంకా చాలామంది తేరుకోలేదు. ఆ రేంజ్ లో దెబ్బ కొట్టింది లైగర్. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన లైగర్ మూవీ.. కొంతమంది బయ్యర్లు, ఎగ్జిబిటర్లను నిలువునా ముంచేసింది. ఇప్పటికీ ఆ సినిమా షాక్, కొంతమందిని షేక్ చేస్తూనే ఉంది.

ఆ మరుసటి ఏడాది, అంటే 2023 ఆగస్ట్ లో కూడా బిగ్ షాక్ ఉంది. ఈసారి భోళాశంకర్ వంతు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఊహించని పరాజయం పాలైంది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి ఇమేజ్ కే మచ్చ తెచ్చేంతలా డ్యామేజ్ చేసింది భోళాశంకర్.

ఇది ఏ రేంజ్ ఫ్లాప్ అంటే, నిర్మాత తన ఆస్తులు కూడా అమ్ముకున్నాడనే ప్రచారం జరిగింది అప్పట్లో. తర్వాత దాన్ని ప్రొడ్యూసర్ ఖండించారు. అదే ఏడాది ఆగస్ట్ లో వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున కూడా డిజాస్టర్ అయింది.

ఇక ఈ ఏడాది ఆగస్ట్ లో రెండు షాక్ లు. ఒకటి డబుల్ ఇస్మార్ట్. రెండోది మిస్టర్ బచ్చన్. ఈసారి రవితేజ ఇమేజ్ నే దెబ్బకొట్టే రేంజ్ లో, అతడి స్టోరీ సెలక్షన్ ను అనుమానించే విధంగా డిజాస్టర్ అయింది మిస్టర్ బచ్చన్ సినిమా. హరీశ్ శంకర్ డైరక్ట్ చేసిన ఈ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

ఇక రామ్, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ది కూడా ఇదే పరిస్థితి. కథలో డెప్త్ లేదు, కథనంలో గ్రిప్ లేదు, మాటల్లో పూరి మార్క్ లేదు. పాటలు తప్ప మిగతావన్నీ తేలిపోవడంతో డబుల్ ఇస్మార్ట్ సినిమా డబుల్ ఫ్లాప్ అనిపించుకుంది.

ఇలా కరోనా తర్వాత ప్రతి ఏటా ఆగస్ట్ లో షాకులు తగుల్తూనే ఉన్నాయి. నిజానికి ఈ నెలల్లో మరికొన్ని విజయాలున్నప్పటికీ, ఊహించని ఎదురుదెబ్బలు మాత్రం కామన్ అయ్యాయి. వచ్చే ఏడాదైనా ఈ పద్ధతి మారుతుందేమో చూడాలి.

5 Replies to “ప్రతి ఏటా ఆగస్ట్ షాక్ తప్పదా..?”

    1. Nijame! Ntr, anr, krishna, sobhanbabu, krishnamraju, chiru, venky, Rajendraprasad, raviteja, allari naresh own ga fan base create chesukjnna vallu….. AA ni modatlo mega fans encourage chesina maata vaastavam, tarvata tana own fan base ni create chesukogaligadu

Comments are closed.