త్రిష అలా చేయలేదు.. మాటమార్చిన రాజకీయ నేత

మొన్న మన్సూర్ అలీఖాన్ చేసిన పనే, ఇప్పుడు తమిళ రాజకీయ నాయకుడు ఏవీ రాజు చేశారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ప్రకటించుకుంటూనే, త్రిషకు క్షమాపణలు చెప్పారు. నోటికొచ్చినట్టు మాట్లాడ్డం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం…

మొన్న మన్సూర్ అలీఖాన్ చేసిన పనే, ఇప్పుడు తమిళ రాజకీయ నాయకుడు ఏవీ రాజు చేశారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ప్రకటించుకుంటూనే, త్రిషకు క్షమాపణలు చెప్పారు. నోటికొచ్చినట్టు మాట్లాడ్డం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం అలవాటైపోయింది. పైగా ఈసారి రాజకీయ నాయకుడు కాబట్టి, ఆయన నాలుక ఆటోమేటిగ్గా మడతడిపోయింది. రెండో రోజుకే మాట మార్చాడు.

త్రిష ఒక రాత్రికి 25 లక్షల రూపాయలు తీసుకుందని, ఎమ్మెల్యే వెంకటాచలం డబ్బు ఇవ్వడం తను కళ్లారా చూశానని, తనే ప్రత్యక్ష సాక్షిని అంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన రాజు.. ఇప్పుడు మాట మార్చారు. తన మాటల్ని మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చారు.

ఓ సెటిల్ మెంట్ లో భాగంగా మాత్రమే త్రిష 25 లక్షల రూపాయలు తీసుకుందని అంటూనే.. ఆమెకు, వెంకటాచలంకు క్షమాపణలు చెప్పారు. ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డం, తర్వాత నెపాన్ని మీడియా మీదకు నెట్టేయడం కామన్ అయిపోయింది ఈమధ్య.

మన్సూర్ విషయంలో చేసిన తప్పు చేయకూడదు… మన్సూర్ అలీఖాన్ విషయంలో త్రిష మెత్తగా వ్యవహరించింది. పోలీస్ స్టేషన్ నుంచి కేసును ఉపసంహరించుకుంది. క్షమించి వదిలేసింది. ఆ తర్వాత అదే మన్సూర్ మాట మార్చాడు. రివర్స్ లో కోర్టు మెట్లు ఎక్కాడు. ఈసారి మాత్రం త్రిష మెత్తగా ఉండకూడదు. లీగల్ గా గట్టిగా చర్యలు తీసుకోవాలి.

రాజు మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో ఇప్పటికీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో త్రిష గట్టిగా ఉంటే, భవిష్యత్తులో మరో వ్యక్తి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు.

మరోవైపు త్రిషకు మద్దతు పెరుగుతోంది. హీరో విశాల్, ఆమెకు బాసటగా నిలిచాడు. చెత్త వ్యాఖ్యలు చేసిన రాజు, నరకానికి వెళ్తాడంటూ కామెంట్ చేశాడు.