ఉప్పెన సినిమా తరువాత ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా క్రెడిట్ ఎవరికి వెళ్తుందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు లేటెస్ట్ గా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ అంటూ ఊరమాస్ ఫ్క్ష్యాక్షన్ కథతో జనం ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ వదిలారు. చూడగానే అర్థం అయిపోయింది. ఇది ఎంత పాత చింతకాయపచ్చడి కథో.
అనగనగా ఓ రాయలసీమ. అక్కడ మైనింగ్. మైనింగ్ కొండల్లో ఓ గుడి. దాని మీద కూడా మైనింగ్ జనాల కన్ను. అడ్డం పడిన కుర్రాడు. పేరు రుద్రకాళేశ్వర రెడ్డి. ఇక ఆపై చెప్పనక్కరలేదు కదా..కథ ఎలా సాగుతుందో. ఏనాటి ఫ్యాక్షన్ కథలు. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అందరూ చేసి వదిలేసారు. ఇప్పుడు ఇక్కడ తన లక్ పరిశీలించుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్.
శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణాదాస్ లాంటి భారీ తారాగణం, భారీ ఖర్చు వుంది కనుక, వైష్ణవ్ కు ఓ హిట్ పడుతుందేమో అన్న ఆశ వుంది. కానీ సోషల్ మీడియాలో జనాలు మాత్రం వైష్ణవ్..అవసరమా..ఇది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాకు దర్ళకుడు శ్రీకాంత్ రెడ్డి. నిర్మాతలు నాగవంశీ-సాయి సౌజన్య. జూలైలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.