అవతార్-2 సినిమా కోసం భారీగా టికెట్ రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరులో టికెట్ రేటు గరిష్టంగా 1400 రూపాయలు ఉంటే, ముంబయిలో ఈ రేటు 1300 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ లో అవతార్-2 టికెట్ రేట్ గరిష్టంగా 600 రూపాయల వరకు ఉంది. మరి అవతార్-2 సినిమాకు పెట్టిన కనిష్ట టికెట్ రేటు ఎంత?
ముంబయి శివార్లలో అవతార్-2 సినిమాను వంద రూపాయల్లో చూడొచ్చు. ఇక చెన్నైలోని కొన్ని థియేటర్లలో అవతార్-2 టికెట్ ధరను కనిష్టంగా 66 రూపాయలుగా నిర్ణయించారు.
హైదరాబాద్ సిటీలో అవతార్-2 సినిమా టికెట్ కనీస ధర 50 రూపాయల నుంచి 80 రూపాయల మధ్య ఉంది. అయితే ఈ రేటు తెలుగు వెర్షన్ కు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ఏరియాల్లో 50 రూపాయల కనీస ధరకు అవతార్-2 సినిమా అందుబాటులో ఉంది.
మరోవైపు విడుదలకు ముందే ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఫుల్ క్లారిటీతో సినిమా పైరసీ ప్రింట్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ, థియేట్రికల్ రిలీజ్ పై అది పెద్ద ప్రభావం చూపించడం లేదు. ఎందుకంటే, అవతార్-2 లాంటి విజువల్ వండర్ ను సిల్వర్ స్క్రీన్ పైనే చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.