మళ్లీ సినిమాల్లోకి వచ్చిన అవికా గౌర్, తను బాగా వెయిట్ తగ్గానంటోంది. ఇప్పుడు గ్లామర్ షోకు కూడా రెడీ అంటోంది. ఏదైనా సన్నివేశంలో చేయాల్సి వస్తే తప్పకుండా ఎక్స్ పోజింగ్ చేస్తానంటోంది ఈ బ్యూటీ. అయినా తను బరువు పెరిగినా, తగ్గినా ఎక్స్ పోజింగ్ మాత్రం తనకు కొత్త కాదంటోంది.
“ఓసారి ఓ ఈవెంట్ కు స్కర్ట్ వేసుకొని వెళ్లాను. చాలామంది ఆశ్చర్యపోయారు, కొందరు తిట్టారు కూడా. ఎందుకిలా ఎక్స్ పోజింగ్ చేస్తున్నావ్ అన్నారు. అది జస్ట్ స్కర్ట్ మాత్రమే కదా. అందులో తప్పేముంది అనిపించింది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటివరకు ప్రేక్షకులు నన్ను అలా స్కర్ట్ లో చూడలేదు. అందుకే అలా రియాక్ట్ అయ్యారు.”
ఎంతోమంది తిట్టడం వల్ల తను బరువు తగ్గానంటోంది అవికా గౌర్. ఆ విషయంలో ట్రోలింగ్స్ తనకు బాగా సహాయపడ్డాయని చెప్పుకొచ్చింది. బరువు పెరగడం తనకు ఆరోగ్య సమస్య కాదని, కేవలం బద్దకం వల్లనే బరువు పెరిగానంటోంది.
“బరువు తగ్గిన తర్వాత నాపై నాకు నమ్మకం పెరిగింది. ఎలాంటి దుస్తులైనా ధరించగలను. ఈ విషయంలో ట్రోలింగ్ నాకు బాగా హెల్ప్ అయింది. నా బరువుపై వచ్చిన ట్రోలింగ్స్ ను నేను సవాల్ గా తీసుకున్నాను. తగ్గి చూపించాలనుకున్నాను. బరువు తగ్గాను. అలా ట్రోలింగ్ నాకు స్ఫూర్తిగా నిలిచింది. వాళ్లు తిట్టకపోతే నేను లావెక్కిన విషయం నాకు తెలిసేది కాదు.”
రాజుగారి గది 3 సినిమా కోసం ఏకంగా 12 కిలోల బరువు తగ్గానంటోంది అవికా గౌర్. బరువు తగ్గానంటూ తనకు తానుగా ఇలా చాలా చెప్పుకొచ్చింది. కానీ ఆమె బరువు తగ్గిందనే విషయాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేదు. ప్రమోషన్స్ లో, సినిమాలో ఆమె కాస్త బొద్దుగానే ఉంది మరి. అలాంటప్పుడు 12 కిలోలు ఎలా తగ్గిందో..!