అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ.. అప్ డేట్స్ ఇవే!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులను  కలిసి రాష్ట్ర సంబంధిత వ్యవహారాలను గురించి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ అందులో…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులను  కలిసి రాష్ట్ర సంబంధిత వ్యవహారాలను గురించి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్ అందులో భాగంగా అమిత్ షాను కూడా కలిశారు. ఈ సందర్భంగా విభజన చట్టం హామీలు, కేంద్రం నుంచి పెండింగ్ బిల్లుల గురించి అమిత్ షా వద్ద ప్రస్తావించినట్టుగా సమాచారం. 

రెవెన్యూ లోటు విషయంలో కేంద్రం నుంచి పెండింగ్ లో ఉన్న అమౌంట్ గురించి జగన్ గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ లోటుకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మొత్తం కేంద్రం నుంచి రావాల్సి ఉందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఇదివరకే ఈ అంశం గురించి కోరగా.. కాగ్ తో చర్చించి స్పందిస్తామని కేంద్రం చెప్పిందని, ఆ తర్వాత స్పందన లేదని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక కడప స్టీల్ ప్లాంట్, రామయపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి నిధుల విడుదల గురించి ప్రస్తావించినట్టుగా సమాచారం. వెనుకబడిన జిల్లాల నిధులను విడుదల చేయడం పూర్తిగా ఆపేసిన వైనాన్ని కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. దేశంలోని ఇతర వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన మొత్తాలతో పోలిస్తే ఏపీలోని వెనుకబాటు జిల్లాలకు ఇస్తున్న మొత్తాలు చాలా తక్కువనే విషయాన్ని అమిత్ షా వద్ద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టుగా సమాచారం.

పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాలను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని జగన్ గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రివర్స్ టెండరింగ్ ద్వారా వివిధ ప్రాజెక్టుల వ్యయాలను తగ్గించిన వైనాన్ని కూడా జగన్ ప్రస్తావించినట్టుగా సమాచారం. 

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే