రవితేజ- పీపుల్స్ మీడియా- హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. రైడ్ హిందీ సినిమా పాయింట్ తీసుకుని తయారు చేసిన సినిమా ఇది. ఆ కథకు సకల హంగులు అద్దారు. ఒక రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాదిరిగా మార్చారు. పంచ్ డైలాగులు, హీరోయిజం, విలనిజం, అందమైన అమ్మాయి, ఫైట్లు, పాటలు ఇలా అన్నీ సమపాళ్లలో కలిపి రంగరించినట్లు టైటిల్ చెబుతోంది.
పక్కా బి సి సెంటర్లకు సరిపడే మాస్ కంటెంట్ ను తయారు చేసారని అర్థం అవుతోంది. అయితే కంటెంట్ మొత్తం మీద రవితేజ మార్క్ ఫన్ మిస్ అయింది. కమెడియన్ సత్యతో ఒక్క సీన్ కట్ చేసి వేసారు. కానీ అదే మంత పేలే రకం అయితే కాదు. వింటేజ్ ఫీల్ తీసుకురావాలని, పాత పాట బిట్ లు, పాత రకం లైన్ కొట్టడాలు, ఇలా చాలా చాలా చేసారు.
టీజర్ ను రెండు కోణాల్లో చూడాలి. ఒకటి హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ ఎంటర్ టైనర్. అదే కోణంలో చూస్తే టీజర్ పాసైనట్లే. రెండో కోణం ఇప్పుడు ఈ జనరేషన్ లైక్ చేస్తున్న సినిమాలు. అలా చూస్తే టీజర్ లో కొత్తదనం ఏమీ లేనట్లే.
ఇప్పటికే రెండు పాటలు వచ్చి వైరల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ వచ్చింది. మొత్తానికి ఓ మంచి కమర్షియల్ సినిమా వస్తోందన్న ఫీల్ ను కలిగించింది ఈ కంటెంట్ అంతా కలిసి.
జనం పట్టించుకోరు
అయినా థియేటర్లో చూడం
Call boy jobs available 8341510897
Call boy works 8341510897