క్రాక్ ఈరోజు పడాల్సిందే.. రేపు బ్యాడ్ డే

రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఊహించని విధంగా రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎర్లీ మార్నింగ్ షోలు, మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు పడలేదు. ఈవెనింగ్ షోలు పడతాయా లేదా అనేది…

రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఊహించని విధంగా రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఎర్లీ మార్నింగ్ షోలు, మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు పడలేదు. ఈవెనింగ్ షోలు పడతాయా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

ఇదిలా ఉండగా.. ఈరోజు ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. రేపటికి వాయిదా పడితే మాత్రం అది బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోతుంది.

అవును.. ఈ దశాబ్ద కాలంలో సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ అయిన సినిమా ఏదీ ఆడలేదు. ఆ రోజున రిలీజైన సినిమాలన్నీ ఫ్లాపులు మూటగట్టుకున్నాయి. 

సో.. క్రాక్ సినిమాను రేపు, అంటే జనవరి 10న రిలీజ్ చేయొద్దని రవితేజ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈవెనింగ్ షో కూడా కుదరకపోతే మిడ్ నైట్ షో వేయాలని.. అంతే తప్ప రేపటికి మాత్రం రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇంతకీ ఈ దశాబ్ద కాలంలో జనవరి 10న రిలీజై ఫ్లాప్ అయిన సినిమాలేంటో తెలుసా..?

అజ్ఞాతవాసి.. పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా. ఈ మూవీని 2018లో జనవరి 10న రిలీజ్ చేశారు. సినిమా డిజాస్టర్ అయింది. 

మేకర్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో, మూవీ అంత ఫ్లాప్ అయింది. నిర్మాతలకు తీరని నష్టం మిగిల్చింది. ఈ మూవీ తర్వాత ఇప్పటివరకు మళ్లీ సినిమా చేయలేదు పవన్ కల్యాణ్.

ఇక ఈ లిస్ట్ లో మహేష్ బాబు మూవీ కూడా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో అతడు చేసిన సినిమా 1-నేనొక్కడినే. సంక్రాంతి కానుకగా 2014, జనవరి 10న రిలీజైన ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. 

ఈ పదేళ్లలో జనవరి 10న రిలీజైన సినిమాలు ఇవే. అంతకంటే ముందు 2003 జనవరి 10న వచ్చిన ఎన్టీఆర్ నాగ కూడా ఫ్లాప్ అయింది.

అందుకే సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలొచ్చినా జనవరి 10న మాత్రం ఎవ్వరూ రిలీజ్ పెట్టుకోరు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల మధ్య క్రాక్ మూవీ ఆ తేదీకి వచ్చేలా ఉంది. 

బ్యాడ్ సెంటిమెంట్ ను మూటగట్టుకున్న జనవరి 10న (రేపు) ఈ సినిమాను రిలీజ్ చేస్తారా.. లేక కిందామీద పడి మరికొద్దిసేపట్లో థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది చూడాలి.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ