సమ్మర్ బరిలో మరో సినిమా లాక్ అయింది

సంక్రాంతి సీజన్ తర్వాత అంతో ఇంతో కాసులు కురిపించేది సమ్మర్ సీజన్ మాత్రమే. అందుకే మేకర్స్ ఇప్పట్నుంచి తమ సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.  Advertisement మంచి తేదీలు చూసి ముందుగానే కర్చీఫ్ వేసుకుంటున్నారు.…

సంక్రాంతి సీజన్ తర్వాత అంతో ఇంతో కాసులు కురిపించేది సమ్మర్ సీజన్ మాత్రమే. అందుకే మేకర్స్ ఇప్పట్నుంచి తమ సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. 

మంచి తేదీలు చూసి ముందుగానే కర్చీఫ్ వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రానా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. ఇప్పుడు నాని కూడా తన కొత్త సినిమాకు సమ్మర్ నే ఫిక్స్ చేశాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీని ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కాస్త ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, ఓ పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటన ఇచ్చేశారు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో నానిలోని యాక్షన్ కోణాన్ని బయటపెడితే, ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ చూపించారు. ఇలా తమ సినిమాలో అన్నీ ఉన్నాయనే సందేశాన్నిచ్చారు మేకర్స్.

శివనిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి చేసిన నిన్నుకోరి సినిమా హిట్టయింది. రీతూ వర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ