Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఏప్రిల్ 9 తమ్ముడు..మే 9 అన్న

ఏప్రిల్ 9 తమ్ముడు..మే 9 అన్న

సమ్మర్ కోసం రెండు మెగా మూవీస్ ముస్తాబవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఇఫ్పటికే రెడీ అయిపోతోంది. ఏప్రిల్ 9న విడుదల అన్నది ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట. 

దీంతో పాటు మరో టాక్ కూడా వినిపిస్తోంది.మెగాస్టార్ ఆచార్య సినిమా ను మే9న విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. రామ్ చరణ్ కనుక మార్చి ఫస్ట్ వీక్ నుంచి వస్తే మే 9న విడుదల చేయడం పెద్ద కష్టం కాదని, ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే రంగ్ దే, టక్ జగదీష్ సినిమాలు సమ్మర్ డేట్ లు ప్రకటించేసాయి. ఉప్పెన సినిమాను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. 

అన్నింటికి మించి రాధేశ్వామ్ సినిమా సంగతి మాత్రం తెలియడం లేదు. ఏప్రిల్ 30 అన్న మాట అయితే వుంది కానీ అప్పటికి సినిమా రెడీ అవుతుందా? సిజి వర్క్ లు ఫినిష్ అవుతాయా అన్న అనుమానాలు వుండనే వున్నాయి.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?